Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్ ఓట‌మిపై అజ‌రుద్దీన్ షాకింగ్ కామెంట్స్‌!

ICC Cricket World Cup 2019 : Azharuddin Says 'West Indies Lost The Plot Once Chris Gayle Got Out'
West Indies lost the plot once Chris Gayle got out, says Mohammad Azharuddin

న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌.. త‌న వైభ‌వాన్ని కోల్పోయి చాలాకాల‌మైంది. ద‌శాబ్దాల కింద‌టే ఆ జ‌ట్టు క‌ళ త‌ప్పింది. ల‌య‌ను కోల్పోయింది. క‌ళావిహీనంగా మారింది. జ‌ట్టును గాడిన పెట్ట‌డానికి ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేప‌ట్టిన సంద‌ర్భాలు కూడా దాదాపుగా లేవు. శివ్ నారాయ‌ణ్ చంద‌ర్‌పాల్ హ‌యాంలో వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టు ఓ వెలుగు వెలిగింది. చంద‌ర్‌పాల్ రిటైర్ అయిన త‌రువాత‌.. నానాటికీ క్షిణిస్తూ వ‌చ్చింది విండీస్ ఆట‌తీరు. క్రిస్ గేల్ వంటి ఒక‌రిద్ద‌రు బ్యాట్స్‌మెన్ల మీదో, డ్వేన్ బ్రావో వంటి ఒక‌రిద్ద‌రు బౌల‌ర్ల మీదో ఆధార‌ప‌డుతోంది.

మ‌ర‌మ్మ‌తు అవ‌స‌రం..

మ‌ర‌మ్మ‌తు అవ‌స‌రం..

వెస్టిండీస్ జ‌ట్టు అంటే భార‌తీయులు సైతం అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. క‌రేబియ‌న్ క్రికెట‌ర్ల‌ను అక్కున చేర్చుకుంటారు. టీమిండియాతో స‌మానంగా వారినీ ఆద‌రిస్తారు. అలాంటి క్రికెట్ జ‌ట్టు త‌న ప్రాభ‌వాన్ని కోల్పోవ‌డం ప‌ట్ల కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జ‌ట్టుకు రిపేర్లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. చాలాకాలం కింద‌టే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుని ఉంటే ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సి వ‌చ్చేది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

క్రిస్ గేల్ మీద ఆధార‌ప‌డొద్దు..అజ‌రుద్దీన్‌

క్రిస్ గేల్ మీద ఆధార‌ప‌డొద్దు..అజ‌రుద్దీన్‌

విధ్వంస‌క ఓపెన‌ర్‌గా గుర్తింపు పొందిన క్రిస్ గేల్‌పై వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టు మొత్తం ఆధార‌ప‌డుతోందని టీమిండియా మాజీ కేప్టెన్‌, హైద‌రాబాదీ మ‌హ‌మ్మ‌ద్ అజ‌రుద్దీన్ అన్నారు. ఒక‌రిద్ద‌రి మీద ఆధార‌ప‌డ‌టం స‌రైన‌ది కాద‌ని ఆయ‌న చెప్పారు. క్రిస్ గేల్‌ను అవుట్ చేస్తే.. ఇక విండీస్ టీమ్ మొత్తాన్నీ అవుట్ చేసిన‌ట్టే అవుతంద‌నే అభిప్రాయానికి అన్ని దేశాల క్రికెట్ జ‌ట్లు వ‌చ్చాయ‌ని అన్నారు. గేల్‌ను అవుట్ చేయ‌డానికి ప‌క్కాగా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకున్నాయ‌ని, వాటిని అంతే ప‌క్కాగా అమ‌లు చేస్తున్నాయ‌ని చెప్పారు. ఫ‌లితంగా- క్రిస్ గేల్ తొంద‌ర‌గా అవుట్ అవుతున్నాడ‌ని, దీని ప్ర‌భావం మిగిలిన బ్యాట్స్‌మెన్ల‌పై ప‌డుతోంద‌ని అన్నారు. ఒక్క‌సారి గేల్ అవుటైన త‌రువాత వెస్టిండీస్ క్రికెట‌ర్లు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఎదుర్కొని నిల‌బ‌డ‌తార‌ని తాను అనుకోవ‌ట్లేద‌ని అన్నారు.

త్వ‌ర‌గా కోలుకుంటుంద‌నే ఆశిస్తున్నా..

త్వ‌ర‌గా కోలుకుంటుంద‌నే ఆశిస్తున్నా..

ప్ర‌స్తుతం వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టుకు గ‌డ్డురోజులు న‌డుస్తున్నాయ‌ని అజ‌రుద్దీన్ చెప్పారు. దీన్ని నుంచి త్వ‌ర‌గానే ఒడ్డున ప‌డాల‌ని తాను ఆశిస్తున్నాన‌ని అన్నారు. వెస్టిండీస్ వంటి జ‌ట్టు బ‌ల‌హీనం కావ‌డం క్రికెట్‌కు మంచిది కాద‌ని చెప్పారు. విండీస్ త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన ఆట‌తీరును కోల్పోయింద‌ని, దీన్ని మ‌ళ్లీ స‌మ‌కూర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అజ‌రుద్దీన్ అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ వంటి నాణ్య‌మైన బౌలింగ్ వ‌న‌రులు ఉన్న జ‌ట్టు ఎదురుప‌డితే క‌రేబియ‌న్లు త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఆడ‌లేక‌పోతున్నార‌ని, ఒక‌ప్పుడు ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని అజ‌రుద్దీన్ అన్నారు. పేస్‌, స్పిన్ బౌలింగ్‌ల‌ను అద్భుతంగా ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్లు ఆ జ‌ట్టులో ఉండేవార‌ని, ప్ర‌స్తుతం దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి ఉంద‌ని చెప్పారు.

రిష‌బ్ పంత్ తీసుకోవ‌డం ఉత్తమం..

రిష‌బ్ పంత్ తీసుకోవ‌డం ఉత్తమం..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో టీమిండియా త‌న త‌దుప‌రి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోబోతోంది. ఆదివారం జ‌రిగే ఈ మ్యాచ్‌లో విజ‌య్ శంక‌ర్‌కు బ‌దులుగా రిష‌బ్ పంత్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవాల‌ని అజ‌రుద్దీన్ సూచించారు. ఇంగ్లండ్‌పై ఆడిన అనుభ‌వం రిష‌బ్ పంత్‌కు ఉంద‌ని, అక్క‌డి పిచ్‌లు అత‌నికి తెలుస‌ని చెప్పారు. విజ‌య్‌శంక‌ర్‌లో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అనుభవం లేక‌పోవ‌డం వ‌ల్ల ఒత్త‌డికి గుర‌వుతున్నాడ‌ని అన్నారు. దీని ప్ర‌భావం అత‌ని ఆట‌తీరుపై ప‌డుతోంద‌ని, నాలుగో స్థానంలో విజ‌య్ శంక‌ర్‌ను ఆడించ‌డానికి మ‌రికొంత స‌మ‌యం తీసుకుంటే బాగుంటుంద‌ని అన్నారు.

Story first published: Friday, June 28, 2019, 10:37 [IST]
Other articles published on Jun 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+