ఇంగ్లండ్ మళ్లీ తడబ్యాటు.. విజయంపై విండీస్ గురి!

సౌతాంప్టన్: ఇంగ్లండ్ గడ్డపై కరీబియన్లు ఇరగదీస్తున్నారు. భీకరమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగానే పోరాడినా.. విండీస్ వీరులు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. రెండు సెషన్లలో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించినా.. ఆఖరి సెషన్‌లో ప్రత్యర్థి ఆట కట్టించారు.

అనూహ్య మలుపులు తిరిగిన ఈ చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించే అద్భుత అవకాశం వెస్టిండీస్‌ ముందు నిలిచింది. మ్యాచ్‌ చివరి రోజు ఆదివారం విండీస్‌ ఎంత లక్ష్యాన్ని ఛేదించగలదనేది ఆసక్తికరం.

30 రన్స్ వ్యవధిలోనే సీన్ రివర్స్..

30 రన్స్ వ్యవధిలోనే సీన్ రివర్స్..

శనివారం నాలుగో రోజు ఆటలో ఒక దశలో ఇంగ్లండ్‌ స్కోరు 249/3. కానీ విండీస్‌ బౌలర్ల విజృంభణతో అంతా మారిపోయింది. 30 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ప్రత్యర్థికి విజయావకాశాన్ని అందించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 104 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.

ఫస్ట్ సెషన్‌తో ఫలితం..

ఫస్ట్ సెషన్‌తో ఫలితం..

జాక్‌ క్రాలీ (127 బంతుల్లో 8 ఫోర్లతో 76), డామ్‌ సిబ్లీ (164 బంతుల్లో 4 ఫోర్లతో 50) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (79 బంతుల్లో 6 ఫోర్లు 46 ), రోరీ బర్న్స్‌ (104 బంతుల్లో 5 ఫోర్లతో 42) రాణించారు. ప్రస్తుతం క్రీజులో జోఫ్రా ఆర్చర్‌ (5 బ్యాటింగ్‌), వుడ్‌ (1 బ్యాటింగ్‌) ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో గాబ్రియెల్‌ 3 వికెట్లు పడగొట్టగా... జోసెఫ్, ఛేజ్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు ఫస్ట్ సెషన్ ఆటే ఫలితాన్ని డిసైడ్ చేయనుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 204 రన్స్‌కే ఆలౌటవగా.. విండీస్ 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఆచితూచి.. జోరు పెంచి

ఆచితూచి.. జోరు పెంచి

ఓవర్‌నైట్ స్కోరు 15/0 ఇంగ్లండ్ ఆట కొనసాగించగా.. మార్నింగ్ సెషన్‌లో ఓపెనర్లు రోరి బర్న్స్, సిబ్లే చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. కీమర్ రోచ్, గాబ్రియెల్ తమ పదునైన బంతులతో పరీక్ష పెట్టగా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం తొందరపడలేదు. తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. ఈ క్రమంలో వీరిద్దరి కొన్ని చక్కటి షాట్లు ఆడారు. లంచ్‌కు కొద్ది సేపు ముందు ఎట్టకేలకు బర్న్స్‌ను అవుట్‌ చేసి ఛేజ్‌ ఈ భాగస్వామ్యానికి తెర దించాడు.

16 రన్స్.. 3 వికెట్స్..

16 రన్స్.. 3 వికెట్స్..

తొలి సెషన్‌లో 30 ఓవర్లలో ఇంగ్లండ్‌ 64 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో 161 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి సిబ్లీ వెనుదిరగ్గా... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి డెన్లీ (29) అవుటయ్యాడు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ 30 ఓవర్లలో 89 పరుగులు చేయగా, విండీస్‌ 2 వికెట్లు పడగొట్టగలిగింది. టీ విరామం తర్వాత క్రాలీతో కలిసి కెప్టెన్‌ స్టోక్స్‌ ధాటిగా ఆడాడు.

80 బంతుల్లో క్రాలీ అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకోగా... 19వ బంతికి తొలి పరుగు తీసిన స్టోక్స్‌ ఆ తర్వాత జోరు పెంచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. అయితే కొత్త బంతితో విండీస్‌ దెబ్బ కొట్టింది. వరుస ఓవర్లలో స్టోక్స్, క్రాలీలను అవుట్‌ చేసి పైచేయి సాధించింది. ఆ వెంటనే బట్లర్‌ (9) కూడా పెవిలియన్‌ చేరాడు. అనంతరం బెస్‌ (3), పోప్‌ (12) లను గాబ్రియెల్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ విండీస్ చేతుల్లోకి వచ్చింది. 12.3 ఓవర్ల వ్యవధిలో అంతా మారిపోయింది.

మీరేం అంపైర్లు సామీ.. ఇన్ని తప్పుడు నిర్ణయాలు.. ఇంత పక్షపాతమా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, July 12, 2020, 7:59 [IST]
Other articles published on Jul 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X