Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండిస్‌తో శ్రీలంక తొలి డే-నైట్‌ టెస్టు

West Indies to host first day-night Test against Sri Lanka

హైదరాబాద్: జూన్‌లో శ్రీలంకతో జరిగే చివరి టెస్టును వెస్టిండిస్‌ డే-నైట్‌ టెస్టుగా నిర్వహించనున్నట్టు శ్రీలంక క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది శ్రీలంక జట్టు కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఇరు జట్లమధ్య జరుగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టును డేనైట్‌ టెస్టుగా నిర్వహించనున్నారు.

జూన్ 23న కెన్సింగ్టన్‌ ఓవల్‌ వేదికగా ఈ మూడో టెస్టు జరగనుంది. కరేబియన్ పర్యటన కోసం శ్రీలంక మే చివరి వారంలో వెస్టిండిస్‌కు చేరుకోనుంది. అనంతరం లంక జట్టు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం జూన్‌ 6నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగోలోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో తొలి టెస్టు, జూన్‌ 14 నుంచి సెయింట్‌ లూసియాలో రెండో టెస్టు ఆడుతుంది.

ఇప్పటివరకు వెస్టిండీస్‌ రెండుసార్లు డేనైట్‌ టెస్టులలో ఆడినప్పటికీ స్వదేశంలో ఆడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా శ్రీలంక తమ తొలి డేనైట్‌ టెస్టును గతేడాది యూఏఈలో పాకిస్థాన్‌తో ఆడిన సంగతి తెలిసిందే. నవంబర్ 2015లో అడిలైడ్ ఓవల్ వేదికగా తొలి డేనైట్ టెస్టు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 8:56 [IST]
Other articles published on Feb 7, 2018
Read in English: WI to play D/N Test with SL
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+