For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌పై విండీస్ రికార్డ్: ఇలా వచ్చారు.. కొట్టేదెవరో?

By Srinivas

కోల్‌కతా: వెస్టిండీస్ - ఇంగ్లాండ్ జట్లు నాలుగు ట్వంటీ 20 ప్రపంచ కప్‌లలో పరస్పరం తలపడ్డాయి. అన్నింటిలోని విండీస్ గెలిచింది. మొత్తంగా ట్వంటీ 20ల్లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌ గెలుపోటముల రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. 9 మ్యాచుల్లో విండీస్ గెలిస్తే, నాలుగింట ఇంగ్లాండ్ గెలిచింది.

ఈ ప్రపంచ కప్‌లో విండీస్ జట్టు ఎక్కువ సిక్సర్ల మోత మోగించింది. సూపర్-10 నుంచి టోర్నీలో అత్యధిక సిక్సర్లు విండీస్ ఖాతాలో ఉన్నాయి. ఆ జట్టు మొత్తం 36 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత 34 సిక్సర్లతో ఇంగ్లాండ్‌ ఉంది. సూపర్-10 నుంచి ఈ రెండు జట్లు మాత్రమే 30పైగా సిక్సర్లు బాదాయి.

ఇరు జట్లలోను స్టార్లు ఉన్నారు. ఇంగ్లాండ్ జేసన్ రాయ్‌ను బ్యాటింగ్ విషయంలో నమ్ముకుంది. బట్లర్, జో రూట్ ఫాంలో నిలకడగా ఉన్నారు. విండీస్ తరఫున గేల్, సిమన్స్, చార్లెస్, రసెల్‌లు ఉన్నారు.

West Indies have 4-0 record against England in WC T20

ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో ఇరుజట్లు ఇలా...

2009లో.. డక్ వర్తలూయిస్ పద్ధతిలో 2009లో ఇంగ్లాండును వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. డక్ వర్తలూయిస్ పద్ధతి ప్రకారం.. విండీస్ 8.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఓవల్‌లో జరిగింది.

2010లో... ఈ మ్యాచ్‌ని కూడా విండీస్ డక్ వర్తలూయిస్ పద్ధతిలోనే గెలిచింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. విండీస్ ఆ తర్వాత 5.5 ఓవర్లలో 60 పరుగులు చేసింది. (డక్ వర్తలూయిస్ పద్ధతిలో గెలిచింది.)

2012లో... శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన సూపర్ 8లో విండీస్.. ఇంగ్లాండ్ పైన 15 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. విండీస్ 179 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 164 పరుగులు మాత్రమే చేసింది.

West Indies have 4-0 record against England in WC T20

2016లో... ఇదే ప్రపంచ కప్‌లో గ్రూప్‌లో భాగంగా ఇంగ్లాండ్ - విండీస్‌లు తలపడ్డాయి. ముంబైలో జరిగిన మ్యాచులో విండీస్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ 182 పరుగులరు చేయగా, విండీస్ దానిని 18.1 ఓవర్లలో ఛేదించింది.

ఫైనల్లోకి విండీస్ ఇలా వచ్చింది... ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం, శ్రీలంకపై ఏడు వికెట్ల విజయం, సౌతాఫ్రికాపై మూడు వికెట్ల తేడాతో విజయం, ఆఫ్గన్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమి. సెమీ ఫైనల్లో భారత్‌పై ఏడు వికెట్లతో విజయం.

West Indies have 4-0 record against England in WC T20

ఇంగ్లండ్... వెస్టిండీస్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి, సౌతాఫ్రికాపై రెండు వికెట్ల తేడాతో విజయం, ఆఫ్ఘన్ పైన 15 పరుగులతో విజయం, శ్రీలంకపై 10 పరుగుల తేడాతో గెలుపు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల గెలిచింది.

కోల్‌కతా పిచ్..

పిచ్‌పై పచ్చిక ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువే. ఇంతకుముందు ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో బౌలర్లదే ఆధిపత్యం. రాత్రి మంచు ప్రభావం ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గుచూపొచ్చు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+