For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్ చేతిలో ఓటమి: ఏకైక టెస్టులో చెత్త రికార్డు నమోదు చేసిన ఆప్ఘన్

West Indies crush Afghanistan by 9 wickets in one-off Test

హైదరాబాద్: లక్నో వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 109-7 ఇన్నింగ్స్ కొనసాగించిన ఆప్ఘనిస్థాన్ 120 పరుగులకే ఆలౌటైంది. విండిస్ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, రకిమ్‌ కార్నివాల్‌, రోస్టన్‌ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు సాధించారు.

మూడో రోజు సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఆటలో ఆప్ఘన్ 19 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఆటలో ఆప్ఘనిస్థాన్ కోల్పోయిన మూడు వికెట్లు జాసన్ హోల్డర్‌‌కే దక్యాయి. ఫలితంగా ఆప్ఘనిస్థాన్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్‌లో మూడో అ‍త్పల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా ఆప్ఘన్ నిలిచింది.

టెస్టు హోదా పోందిన తర్వాత

టెస్టు హోదా పోందిన తర్వాత

టెస్టు హోదా పోందిన తర్వాత గతేడాది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియాతో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ 109, 108 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్థాన్‌కు ఇది నాలుగో టెస్టు కావడం విశేషం. ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై ఆప్ఘన్ టెస్టు విజయాలను నమోదు చేసింది.

నాలుగు టెస్టులాడిన ఆప్ఘన్

నాలుగు టెస్టులాడిన ఆప్ఘన్

మొత్తంగా నాలుగు టెస్టులాడిన ఆప్ఘనిస్థాన్ రెండు టెస్టుల్లో ఓడిపోయి.. మరో రెండు టెస్టుల్లో విజయం సాధించింది. వెస్టిండిస్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించినట్లైతే ఆడిన మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో మూడింటిని గెలిచిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించేది.

రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్

రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్

అంతకుముందు వెస్టిండీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసి అలౌటైంది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఆప్ఘనిస్థాన్ 43.1 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ జావెద్‌ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు.

9 వికెట్ల తేడాతో ఘన విజయం

9 వికెట్ల తేడాతో ఘన విజయం

ఫలితంగా విండిస్‌‌కు 31 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 6.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(8) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్యాంప్‌బెల్‌(19 నాటౌట్‌), షాయ్‌ హోప్‌(6 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా విండీస్‌కు విజయాన్ని అందించారు.

Story first published: Friday, November 29, 2019, 12:25 [IST]
Other articles published on Nov 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+