లండన్: తాను ఏకంగా 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనట్టు వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ చెప్పి తన రసికతను ప్రకటించుకున్నాడు. క్రికెటర్‌గా కన్నా ఎక్కువగా అతను స్పోర్టింగ్ ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న తన ఆత్మకథ'మైండ్ ద విండో్‌స'లో మహిళలతో తాను పెట్టుకున్న సంబంధాల గురించి రాశాడు.
క్రికెటర్‌గా మైదానంలో ఆటలో కన్నా పడక గదిలో రాసక్రీడలతో తాను బద్దలు కొట్టిన రికార్డుల గురించి పుస్తకంలో రాసుకున్నాడు. తనకు అమ్మాయిలంటే పిచ్చి అని, తాను ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన బాల్డ్ హెడెడ్ గయ్ (బట్టతల)గా భావించేవాడినని చెప్పుకున్నాడు. బ్లాక్ బ్రాడ్‌పిట్ అని తనపై తాను జోక్ చేసుకునేవాడిని అని అన్నాడు.
క్రికెటర్‌గా ఎక్కడికి వెళ్లినా తాను అమ్మాయిలతో పడకగది పంచుకునేవాడినని చెప్పాడు. తనకు గుర్తున్నంత వరకు ప్రపంచం మొత్తంలో దాదాపు 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నట్లు 34 ఏళ్ల బెస్ట్ చెప్పుకున్నాడు. భార్య మెలిసాతో విడిపోయిన తర్వాత అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నానని చెప్పాడు.

ఒకరకంగా తాను మగ వేశ్యను అయ్యానని చెప్పాడు. 'నాకు ఒక అమ్మాయి నచ్చితే వెంటనే ఆమె దగ్గరికెళ్లి మాటలు కలిపేవాడిని. అది ఎవరైనా సరే. ఒకవేళ పాప్ సింగర్ బియోన్సె ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తే ఆమెనూ అడుగుతాన'ని అన్నాడు.
తనతో పాటు విండీస్ సహచర ఆటగాళ్లు కూడా అమ్మాయిలతో గడిపేవారన్నాడు. తన రికార్డులు సీనియర్ క్రికెటర్లను ఆకట్టుకుని గొప్పలు పోయాడు. ఒక టూర్‌లో ఎవరు ఎక్కువ మంది అ మ్మాయిలతో గడుపుతారనే విషయంపై తాము పోటీ పెట్టుకునేవాళ్లమని చెప్పాడు.
తన వరకైతే ఉత్తమ రికార్డు 2005లో ఆస్ట్రేలియాలో 11 వారాల పర్యటనలో 40 కంటే ఎక్కు వ మంది అమ్మాయిలతో గడిపానని చెప్పాడు. 2003లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన టినో 25 టెస్టు ల్లో 57 వికెట్లు, 26 వన్డేల్లో 34 వికెట్లు తీశాడు.