Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies: అహ్మ‌దాబాద్ చేరుకున్న వెస్టిండీస్ జ‌ట్టు.. వ‌న్డే స‌మ‌రానికి రెడీ

West Indies cricket team arrives in Ahmedabad for the series with India

భార‌త్‌తో వ‌న్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టు నేడు అహ్మ‌దాబాద్ చేరుకుంది. ఈ మేర‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు త‌మ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించింది. విండీస్ ఆట‌గాళ్లు వ‌స్తున్న ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. కాగా అహ్మ‌దాబాద్‌లో వెస్టిండీస్ క్రికెటర్లు 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండ‌నున్నారు. ఇక భార‌త జ‌ట్టు సోమ‌వారమే అహ్మ‌దాబాద్ చేరుకుని క్వారంటైన్‌లో ఉంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 6, 9, 11వ తేదీల్లో 3 వ‌న్డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ మూడు మ్యాచ్‌ల‌కు కూడా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ స్టేడియం అతిథ్యం ఇవ్వ‌నుంది. అలాగే క‌రోనా కార‌ణంగా వ‌న్డే మ్యాచ్‌ల‌ను వీక్షించడానికి ప్రేక్ష‌కుల‌ను మైదానంలోకి అనుమతించ‌డం లేదు. ఈ మేర‌కు గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ మంగ‌ళ‌వారం ధృవీక‌రించింది.

మొద‌ట నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతాలో 3 వ‌న్డే మ్యాచ్‌లు.. కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలలో మూడు టీ20లు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా వ‌న్డే, టీ20 మ్యాచ్‌ల‌ను ఒక్కో వేదిక‌పై నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు అహ్మ‌దాబాద్ వేదిక‌గా 3 వ‌న్డేలు, కోల్‌క‌తా వేదిక‌గా 3 టీ20 మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వ‌న్డే సిరీస్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌న‌ప్ప‌టికీ కోల్‌క‌తా వేదిక‌గా జ‌రగ‌నున్న టీ20 సిరీస్‌కు మాత్రం ప్రేక్ష‌కుల‌ను అనుమతించ‌నున్నారు. ఈ మేర‌కు బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

మొత్తం 75% మంది ప్రేక్ష‌కుల‌ను అనుమతించ‌నున్నారు. కాగా 16, 18, 20వ తేదీల‌లో కోల్‌క‌తా వేదిక‌గా టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు 6న జ‌ర‌గ‌నున్న వ‌న్డే మ్యాచ్ ద్వారా టీమిండియా 100 వ‌న్డే మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనుంది. ఇప్ప‌టివ‌ర‌కు 999 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6న విండీస్‌తో జ‌రిగే వ‌న్డే మ్యాచ్‌తో 1000 వ‌న్డేలు ఆడిన తొలి జ‌ట్టుగా అరుదైన ఘ‌న‌త‌ను చేరుకోనుంది.

IND VS WI: ODI, T20I India's Squad Selection పై విమర్శలు | Oneindia Telugu

కాగా భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన త‌మ జ‌ట్టును ఎంపిక చేసింది.
విండీస్ వ‌న్డే జ‌ట్టు:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో స్మిత్, ఒడియన్ షెపర్డ్, ఒడియన్ షెపర్డ్ వాల్ష్ జూనియర్.

Story first published: Wednesday, February 2, 2022, 9:56 [IST]
Other articles published on Feb 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+