Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌ను ఓడించాం.. టీమిండియాను కూడా ఓడిస్తాం! పొలార్డ్ హెచ్చ‌రిక‌

West Indies captain Pollard is confident of beating India
IND VS WI: ODI, T20I India's Squad Selection పై విమర్శలు | Oneindia Telugu

ఇంగ్లండ్ గడ్డ‌పై టీ20 సిరీస్ గెలుచుకుని వెస్టిండీస్ జ‌ట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఇంగ్లీష్ టీంను సొంత గ‌డ్డ‌పైనే ఓడించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క‌రేబియ‌న్లు 3-2 తేడాతో గెలుచుకున్నారు. ఈ విజ‌యం అనంత‌రం ఆ జ‌ట్టు కెప్టెన్ కీర‌న్ పొలార్డ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై త‌మ‌కిది అద్భుత విజ‌య‌మ‌ని చెప్పుకొచ్చాడు. త‌మ విజ‌యం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇక తాము ప్ర‌స్తుతం భార‌త ప‌ర్య‌ట‌న‌పై దృష్టి సారించిన‌ట్లు పొలార్డు తెలిపాడు. తాము ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాను ఓడిస్తామ‌ని ఆయ‌న ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశాడు.

కొత్త కెప్టెన్ అయినా రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని టీమిండియాతో ఆడ‌డానికి ఆస‌క్తిగా ఉన్నామ‌ని పొలార్డు చెప్పాడు. కాగా ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ‌, కీర‌న్ పొలార్డు చాలా కాలంగా ఒకే జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు కూడా ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ సారి కూడా ముంబైఇండియ‌న్స్ త‌ర‌ఫునే బ‌రిలోకి దిగ‌నున్నారు. వీరిద్ద‌రికి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్కింది.

కాగా భార‌త్, వెస్టిండీస్‌ మధ్య ఫిబ్ర‌వ‌రి 6 నుంచి 20 మ‌ధ్య వ‌న్డే, టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్లు 3 వ‌న్డేలు, 3 టీ20ల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 6, 9, 11వ తేదీల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇక 16, 18, 20వ తేదీల్లో కోల్‌క‌తా వేదిక‌గా టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఇరు జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ జ‌ట్ల‌ను కూడా ప్ర‌క‌టించాయి. వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు వేర్వేరుగా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

టీమిండియా వన్డే జట్టు

టీమిండియా వన్డే జట్టు

రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్‌, శిఖ‌ర్ ధవన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాద‌వ్‌, శ్రేయస్ అయ్య‌ర్, దీపక్‌ హూడా, రిష‌బ్‌ పంత్‌, చాహర్‌, శార్దూల్ ఠూకూర్, చాహల్‌, కుల్దీప్ యాద‌వ్‌, వాషింగ్ట‌న్‌ సుందర్‌, ర‌వి బిష్ణోయ్‌, సిరాజ్‌, ప్రసిధ్‌, అవేశ్‌ఖాన్‌.

టీమిండియా టీ20 జట్టు

టీమిండియా టీ20 జట్టు

రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), ఇషాన్ కిష‌న్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, సూర్యకుమార్ యాద‌వ్, రిష‌బ్‌ పంత్‌, వెంకటేశ్అయ్య‌ర్, చాహర్‌, శార్దూల్ ఠాకూర్, ర‌వి బిష్ణోయ్‌, అక్షర్ ప‌టేల్, చాహల్‌, సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్ కుమార్‌, అవేశ్‌, హర్షల్‌.

విండీస్ టీ20 జ‌ట్టు

విండీస్ టీ20 జ‌ట్టు

కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరాన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రేవో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, ఓడియన్ స్మిత్, రొమారియో షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.

విండీస్ వ‌న్డే జ‌ట్టు

విండీస్ వ‌న్డే జ‌ట్టు

కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియ‌ర్, హేడెన్.

Story first published: Monday, January 31, 2022, 12:50 [IST]
Other articles published on Jan 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+