Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

43కే ఔట్: టెస్టు క్రికెట్‌లో చెత్త రికార్డుని నమోదు చేసిన బంగ్లా

West Indies bowl out Bangladesh for record low total of 43

హైదరాబాద్: వెస్టిండిస్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదైంది. టెస్టు మ్యాచ్ కావడంతో స్టేడియంలోకి ప్రేక్షకులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకొందరు మైదానానికి రానే లేదు. వచ్చినవారు కూడా కుదురుకోలేదు. 1.. 2.. 3 అంటూ వికెట్లు పడుతూనే ఉన్నాయి.

West Indies bowl out Bangladesh for record low total of 43
1
43699
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో

నార్త్ సౌండ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కనిపించిన దృశ్యం ఇది. 4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2... ఇవీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన స్కోరు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌.. వచ్చినట్టుగా పెవిలియన్‌కు చేరారు. ఒక్క లిటన్‌ దాస్‌(25) తప్ప వేరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు.

43 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

43 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

మిగతా 10 మంది కలిసి చేసింది 18 పరుగులే. 19 ఓవర్లు ముగిశాయో లేదో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ ముగిసింది. 43 పరుగులకే బంగ్లాదేశ్ పది వికెట్లు కోల్పోయింది. ఈ మధ్య కాలంలో టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్‌. అంతేకాదు 21వ శతాబ్దంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.

141 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో

2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, ఇప్పుడు తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది. 2013లో దక్షిణాఫ్రికాపై 45 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్‌ రికార్డును బంగ్లాదేశ్ అధిగమించింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో ముగిసిన రెండో ఇన్నింగ్స్‌గా రికార్డుకెక్కింది.

 1955లో ఇంగ్లండ్‌పై ఆ జట్టు 26 పరుగులకే ఆలౌట్

1955లో ఇంగ్లండ్‌పై ఆ జట్టు 26 పరుగులకే ఆలౌట్

టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు న్యూజిలాండ్‌ పేరిట ఉంది. 1955లో ఇంగ్లండ్‌పై ఆ జట్టు 26 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా (30, 30, 35, 36), ఆస్ట్రేలియా (36), న్యూజిలాండ్‌ (42), ఆస్ట్రేలియా (42), భారత్‌ (42), దక్షిణాఫ్రికా (43)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విండీస్ పేసర్ కీమర్ రోచ్ విజృంభణతో(5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు) బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో 43 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Thursday, July 5, 2018, 16:23 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+