Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన యువ భారత్: సిరీస్ వశం

Suresh Raina
కింగ్స్‌టన్: ఇప్పటికే సిరీస్ నెగ్గామన్న విశ్వాసమో, గెలవలేమా అన్న అతి విశ్వాసమో కానీ వరుసగా మూడు ఆటలు గెలిచిన భారత్ తర్వాత రెండు ఆటలలో బోల్తా పడింది. గురువారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో భారీ పరాజయం పొందింది. దీంతో సిరీస్ 3-2తో భారత్ వశం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ వెస్టిండీస్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మరో 9 బంతులుండగానే విజయం సాధించారు. వెస్టిండీస్ ఆటగాళ్లు మొదట తడబడినప్పటికీ తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడింది. సిమ్మన్స్, భరాత్ భారీగా పరుగులు ఏమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. సిమ్మన్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శర్వాన్ తన దైన శైలిలో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడింపించాడు. శర్వాన్ 75 పరుగులు చేశాడు. ఆ తర్వాత డారెన్ బ్రేవో కూడా సత్తా చాటాడు. శర్వాన్ నిష్ర్కమణ తరువాత క్రీజ్‌లోకి శ్యామ్యూల్స్ అనవసర పు షాట్‌లకు పోకుండా బ్రేవోకు సహకారం అందించాడు.

బ్రేవో6 సిక్సర్లు, 3 ఫోర్లతో భారత్‌పై విరుచకుపడి 86 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్యామ్యూల్స్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి పరుగులతో విండీస్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివర్లో పొలార్డ్ బ్యాట్‌ను ఝుళిపించాడు. 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ బౌలర్లలో మిశ్రా రెండు వికెట్లు తీయగా వినయ్‌కుమార్‌కు ఒక వికెట్టు లభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 251 పరుగులు చేసింది. రోహిత్, కోహ్లీ రాణించి భారత్ భారీ స్కోరుకు బాట వేశారు. అయితే భారత్ అన్ని ఓవర్లు ఆడకుండానే తమ ఆట ముగించింది. 47.3 ఓవర్లలోనే అందరూ అవుట్ అయ్యారు. వెస్టీండీస్ బౌలర్లు వికెట్లన్నీ తీయగా మన బౌలర్లు మూడు వికెట్లు తీయడానికే కష్టపడ్డారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+