బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన వెస్టిండీస్.. వన్డే, టీ20 జట్లు ఇవే, ఆ ముగ్గురు ఔట్..!

స్వదేశంలో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. జూలై 2న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఈ క్రమంలో టీ20, వన్డే జట్ల స్క్వాడ్లను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఐపీఎల్లో రాణించిన ఒబెడ్ మెక్‌కాయ్ తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.
మెక్‌కాయ్ ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అతను స్లాగ్ ఓవర్లో తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక మెక్‌కాయ్ గాయం నుంచి కోలుకున్నాడని, అతను బంగ్లాదేశ్‌తో సిరీస్లో ఆడ్డానికి సంసిద్ధం అయ్యాడని వెస్టిండీస్ జట్టు మేనేజ్ మెంట్ ఆశిస్తోంది.

వాళ్లకు మొండిచేయి
ఇకపోతే ఫాబియన్ అలెన్, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్ లాంటి ప్లేయర్లకు జట్టులో చోటు లభించలేదు. వారి స్థానాల్లో షమర్ బ్రూక్స్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, డెవాన్ థామస్ జట్టులో చోటు దక్కించుకున్నారు. హార్డ్ హిట్టర్ అయిన రోవ్‌మన్ పావెల్ టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక నికోలస్ పూరన్ టెస్టులకు తప్పా టీ20, వన్డేలకు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్.. జట్టులో భవిష్యత్తు కెప్టెన్లను తయారుచేసే యోచనలో ఉన్నందున పావెల్‌కు వైస్ కెప్టెన్ అప్పగించినట్లు పేర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లు ఇవే..
వెస్టిండీస్ టీ20I జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్, హేడెన్ వాల్ష్, జూనియర్. డొమినిక్ డ్రేక్స్
వెస్టిండీస్ వన్డే జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, అండర్సన్ ఫిలిప్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్

టీ20 ప్రపంచకప్ కోసం బలమైన జట్టు కావాలి
టీ20 ప్రపంచ కప్‌కు ముందు సరైన జట్టును పునర్నిర్మించాలని చూస్తున్నందున జట్టులో పలు మార్పులు జరుపుతున్నట్లు చీఫ్ సెలెక్టర్ హేన్స్ తెలిపాడు. 'సాధారణంగా.. ఈ సంవత్సరం అక్టోబర్లో జరగబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ప్లేయర్లను పరీక్షించేలా ప్రస్తుత, రాబోయే సిరీస్‌లను ఉపయోగించుకుంటాం. ఎందుకంటే ప్రపంచ కప్ కోసం మేము మా బలమైన జట్టును ఎంపిక చేయాల్సిన అవసరముంది.' అని హేన్స్ పేర్కొన్నాడు. ఇకపోతే పరిమిత ఓవర్ల సిరీస్లో జాసన్ హోల్డర్‌కు విశ్రాంతినిచ్చారు. ఇక గుడాకేష్ మోటీ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయబోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications