Aakash Chopra: ఆర్సీబీ కెప్టెన్‌గా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతను ఎవరికీ అప్పగించాలో అర్థం కాక జట్టు యాజమాన్యం తర్జన భర్జనలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని తన యుట్యూబ్ ఛానెల్ ద్వారా సూచించాడు.

కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్‌ను కెప్టెన్‌గా నియమించాలని టీమిండియా మాజీ ఓపెపనర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జట్టులో ఉన్న మాక్స్‌వెల్ కూడా కెప్టెన్ ఆఫ్షన్ కింద ఉన్నప్పటికీ అతడు బిగ్‌బాష్ లీగ్‌లో కెప్టెన్‌గా సత్తా చాటలేకపోయాడని చెప్పాడు. జేసన్ హోల్డర్ మంచి ఆల్‌రౌండర్ అని కొనియాడిన చోప్రా.. అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌ను సారథిగా ముందుండి నడిపించాడని గుర్తు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్‌గా ఉండే వ్యక్తి ఆ జట్టులో సీనియర్ ఆటగాడైన విరాట్ కోహ్లీపై ఆధారపడకుండా ఉండాలన్నాడు. అందుకే హోల్డర్ అయితే సరైన న్యాయం చేస్తాడని అభిప్రాయపడ్డాడు. హోల్డర్ నిశబ్దంగా తన పని తాను చేసుకుపోతాడని చెప్పుకొచ్చాడు. అందుకే హోల్డర్‌ను కెప్టెన్సీ కోసం మెగా వేలంలో ఆర్సీబీ జట్టు కొనుగోలు చేయాలని చోప్రా సూచించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అశ్విన్, ధావన్ వంటి వాళ్లు కూడా వేలంలో ఉన్నప్పటికీ వారిని ఆర్సీబీ కెప్టెన్సీ ఆప్షన్ కింద తీసుకోదని తాను భావిస్తున్నట్టు చెప్పాడు.

హోల్డర్‌ను రిటైన్ చేసుకోని ఎస్ఆర్‌హెచ్
కాగా ఐపీఎల్‌లో జేసన్ హోల్డర్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ సారి సన్‌రైజర్స్ రిటెన్షన్ జాబితాలో హోల్డర్‌కు చోటు దక్కలేదు. దీంతో హోల్డర్ ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన హోల్డర్ 14 సగటుతో 189 పరుగులు చేశాడు. మొత్తంగా 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 4/52 .

ఆర్సీబీ రిటెన్షన్ జాబితా
ఈ ఐపీఎల్ సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న వారిలో ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నారు. ఇందులో అత్యధికంగా బెంగళూరు యాజమాన్యం విరాట్ కోహ్లీకి 15 కోట్ల రూపాయలను చెల్లించనుండగా.. మాక్స్‌వెల్‌కు 11 కోట్ల రూపాయలు, సిరాజ్‌కు 7 కోట్ల రూపాయలు చెల్లించనుంది.

ఫిబ్రవరిలో మెగా వేలం
కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా నిర్దారించారు. దీంతో టీంలన్నీ ఐపీఎల్ వేలానికి సిద్ధమవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications