
భారత పర్యటనకు మందు ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ గెలిచి వెస్టిండీస్ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. అదే జోష్‌తో టీమిండియాను ఓడిస్తామని ఆ జట్టు ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాను ఓడిస్తామని సోమవారం ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలర్డ్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్‌పై విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ కూడా టీమిండియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన నిర్ణయాత్మక ఐదో టీ20లో చివరి ఓవర్లో హోల్డర్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హోల్డర్ ఆ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా నిలిచాడు.
స్వదేశంలో టీమిండియాపై గెలవడం అంత సులువు కాదంటూనే, భారత్‌ను ఓడించే సత్తా వెస్టిండీస్‌కు ఉందని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాతో ఆడబోయే మ్యాచ్‌లను తాము అతి పెద్ద సిరీస్‌గా భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లను కల్గి ఉందని చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా స్వదేశంలో టీమిండియా అద్బుతంగా రాణిస్తోందని గుర్తు చేశాడు. గతేడాది స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత తమ జట్టు తీవ్ర నిరాశకు గురైందని హోల్డర్ తెలిపాడు.
ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయి ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ గెలిచామని చెప్పుకొచ్చాడు. అదే ఊపుతో ఇండియాను కూడా ఓడిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌పై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-2 తేడాతో గెలుచుకుంది. ఈ సందర్భంగా తమ డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల మధ్య విబేధాలున్నాయని వస్తున్న వార్తలపై కూడా హోల్డర్ స్పందించాడు. తమ డ్రెస్సింగ్‌లో ఎటువంటి విబేధాలు లేవని స్పష్టం చేశాడు.
కాగా భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. 6, 9, 11వ తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా వన్డే సిరీస్ జరగనుంది. 16, 18, 20వ తేదీల్లో కోల్‌కతా వేదికగా టీ20 సిరీస్ జరగనుంది. ఈ మేరకు భారత జట్టు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుని క్వారంటైన్‌లోకి వెళ్లింది. టీమిండియా 3 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నాడు. అటు వెస్టిండీస్ జట్టు నేడు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది.