మాకు చెప్పకుండా పదవిని ఇచ్చేస్తారా..?

హైదరాబాద్: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరక్టర్లలో ఒకరిగా రిచర్డ్ పైబస్‌ను ఎంచుకోవడం పట్ల దేశ్‌మండ్ హెయిన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేసేటప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డాడు.
ఇంగ్లాండ్ ఆటగాడైన పైబస్ 2013 నవంబరున డైరక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమితులై మూడు సంవత్సరాల పాటు విధులు నిర్వహించాడు. తర్వాత అతని స్థానంలో గతేడాది టెస్ట్ కెప్టెన్ జిమ్మి ఆడమ్స్ చేరాడు. అప్పటి నుంచి పైబస్ భారత్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లకు ప్రధాన కోచ్‌గా ఉండేందుకు అవకాశాల కోసం వెదుకుతున్నాడు. ఈ పదవి నిమిత్తం అతను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరక్టర్ దగ్గర్నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు డారెన్ సమీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పైబస్ గురించి ఇలా పేర్కొన్నాడు. 'అబద్దం.. అబద్దం.. అబద్దం అంతా వట్టి అబద్దం' అతన్ని తిరిగి తీసుకోవడమనేది అంతా అబద్దం అని పేర్కన్నాడు. అతనికి పగటికలలు కనొద్దంటూ సూచించాడు.
ఈ ట్వీట్‌కు పైబస్ వెంటనే ఏమీ స్పందించకపోయినా తన ఫేస్ బుక్ ద్వారా బదులిచ్చాడు. 'హాయ్ దేశ్‌మండ్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 2016లో మూడు వరల్డ్ కప్‍లు గెలుచుకున్న సంగతి మర్చిపోయావా.. అవేమీ అకస్మాత్తుగా వచ్చి పడినవి ఏమీ కావు. ఆ ఈవెంట్లన్నీ నా వల్లే జరిగాయని గుర్తుంచుకో' అని పొందుపరిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications