Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sourav Ganguly: గంగూలీకి ఆ అవకాశం కల్పించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన మమతా..

West Bengal CM Mamata Banerjee urges PM Narendra Modi to allow Sourav Ganguly to contest For ICC President

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పదవీ కాలం ఈ వారంలో ముగుస్తుంది. తర్వాతి బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.

ప్రపంచం గర్విస్తోంది

ప్రపంచం గర్విస్తోంది

గంగూలీకి మద్దతుగా మాట్లాడారు. గంగూలీ తదుపరి ఐసిసి అధ్యక్షుడిగా ఉండటానికి ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. సౌరవ్ గంగూలీని చూసి ప్రపంచం గర్విస్తోందని. అతను ఆటగాడిగా నిరూపించుకున్నాడని, BCCI అధ్యక్షుడిగా మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాడని మమతా చెప్పారు. సౌరవ్, అమిత్ షాల కుమారుడికి మూడేళ్ల పదవీకాలం ఇచ్చారని.

ఆశ్చర్యంగా ఉంది

ఆశ్చర్యంగా ఉంది

కానీ అమిత్ షా కుమారుడి పదవీకాలం ముగియలేదు కానీ సౌరవ్ పదవీకాలం ముగియడం తనకు ఆశ్చర్యంగా ఉంద్నారు. అమిత్ షా కొడుకుతో నాకు ఎలాంటి సమస్య లేకపోయినా, అతను చిన్న పిల్లవాడు. సౌరవ్‌ని ఇలా ఎందుకు తొలగించారు? దీంతో అతనికి అన్యాయం జరిగిందన్నారు. సౌరవ్ గంగూలీకి ఐసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నట్లు తెలిపారు.

విజ్ఞప్తి

విజ్ఞప్తి

"బీసీసీఐలోకి వెళ్లేందుకు సౌరవ్‌కు అర్హత ఉంది. సౌరవ్‌ను ఐసిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాల్సిందిగా ప్రధానికి నా వినయపూర్వక నమస్కారాలు. అతను ఎలా నష్టపోయాడో చూసి నేను షాక్ అయ్యాను. దీన్ని రాజకీయంగా, ప్రతీకారంగా తీసుకోవద్దు. అతను రాజకీయ నాయకుడు కాదు. అతని కోసం, క్రికెట్ కోసం నిర్ణయం తీసుకోండి" అని మమతా బెనర్జీ చెప్పారు.

Story first published: Monday, October 17, 2022, 16:16 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+