Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీని టార్గెట్ చేశారా?.. సెహ్వాగ్, యువీ పోస్టులపై నెట్టింట దుమారం!

టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి దారి తీశాయి. సెహ్వాగ్ మాటలకు మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించడంతో ఇది మరింత పెద్ద ఇష్యూ అయింది. వీళ్లిద్దరూ కలిసి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేశారని కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో గౌతం గంభీర్ గురించే వీళ్లు ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా ఖాతాలో సెహ్వాగ్ కొన్ని కామెంట్స్ చేశాడు. లోపల ఒకటి పెట్టుకొని, బయటకు మరొకటి మాట్లాడే మేక వన్నె పులల గురించి సెహ్వాగ్ తన పోస్టులో ప్రస్తావించాడు. 'కొంత మంది ఎన్ని రకాల మొఖాలు మారుస్తారంటే.. వాళ్ల ఫేస్ వాష్ చాలా త్వరగా అయిపోతుంది' అంటూ తన స్టైల్‌లో సెహ్వాగ్ విమర్శించాడు. ఇలాంటి వాళ్లు చాలా ప్రమాదకరం అని చెప్పాడు.

Virender Sehwag Yuvraj Singh MS Dhoni

'ఇలా రెండు మొఖాలతో ఉండే వాళ్లు చాలా డేంజరస్. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్లను కలిశారా? వాళ్లని ఎలా డీల్ చేశారు? మీ అనుభవాలు చెప్పండి ప్లీజ్' అని సెహ్వాగ్ కోరాడు. అసలు సెహ్వాగ్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. అసలు ఇది క్రికెటర్లకు సంబంధించిన కామెంటా? లేక వ్యక్తిగతంగా ఎవరితో అయినా గొడవ జరిగి ఇలాంటి పోస్టు పెట్టాడా? అని అంతా ఆలోచనలో పడ్డారు.

ఇలాంటి సమయంలో మాజీ ఆల్‌రౌండర్ యవరాజ్ సింగ్.. ఈ పోస్టుకు రిప్లై ఇచ్చాడు. 'గ 20 ఏళ్లలో ఇలాంటి వాళ్లను చాలా మందిని మనమే చూశాం కదా' అని యువీ సమాధానం ఇచ్చాడు. అంతే, నెటిజన్లు దీనిపై చర్చ మొదలు పెట్టేశారు. అసలు సెహ్వాగ్ ఎవర్ని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేశాడు? యువీ ఎవరిని దృష్టిలో ఉంచుకొని దానికి బదులిచ్చాడు? అని మాట్లాడుకుంటున్నారు.

కొందరేమో 'అసలు ఎవరు గురించి మాట్లాడుతున్నారో ఆ పేర్లు ధైర్యంగా బయట పెట్టండి. లేదంటే మీరు కూడా రాజకీయ నాయకుల్లో కలిసిపోండి' అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి చాలా మంది మాత్రం అయితే ధోనీ లేదా గంభీర్ గురించే ఈ కామెంట్స్ చేశారని చాలా నమ్మకంగా చెప్తున్నారు. మరి అసలు ఈ ఇద్దరు లెజెండ్స్ ఎవర్ని టార్గెట్ చేశారో వాళ్లకే తెలియాలి.

Story first published: Sunday, August 27, 2023, 11:38 [IST]
Other articles published on Aug 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+