Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీని ట్రోల్ చేసిన సచిన్.. వెల్‌డన్‌ 'దాది' ఏం చెప్పావ్‌!!

Well done dadi: Sourav Ganguly posts training’ photo, Sachin Tendulkar hilariously trolls him

ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్రోల్‌ చేశాడు. దాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఈ ట్రోలింగ్‌కు కారణం అయింది. వివరాల్లోకి వెళితే... 'ఉదయం చల్లని వాతావరణంలో మంచి ఫిట్‌నెస్‌ సెషన్‌ను చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది' అని గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్టుకు దాదా తను ఫిట్‌నెస్‌ సెషన్‌ చేస్తున్న ఆటోను జత చేసాడు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సచిన్‌.. 'వెల్‌డన్‌ దాది! ఏం చెప్పావ్‌' అని సరదాగా కామెంట్ చేశాడు. సచిన్‌ కామెంట్‌కు దాదా రి ట్వీట్ చేసాడు. 'థాంక్యూ ఛాంపియన్‌. ఎప్పుడూ ఫిట్‌నెస్‌పైనే దృష్టి. మన అద్భుతమైన శిక్షణ రోజులు నీకు గుర్తున్నాయా' అని రాసుకొచ్చాడు. 'అవును దాది. శిక్షణలో నువ్వు ఎంత ఎంజాయ్‌ చేశావో అందరికీ గుర్తుంది. ప్రత్యేకంగా స్కిప్పింగ్‌లో' అని సచిన్ మళ్లీ రిప్లై ఇచ్చాడు. ఇంతటితో ఈ సంభాషణ ముగిసింది.

సచిన్-గంగూలీల సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కమిటీల వర్షం కురిపిస్తున్నారు. 'దిగ్గజాలు ఇద్దరు పాత రోజులను నెమరువేసుకుంటున్నారు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'మాజీల సంభాషణ భలే సరదాగా ఉందే' అని మరో అభిమాని ట్వీటాడు.

సచిన్-గంగూలీ కలిసి టీమిండియాకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగి రికార్డుల భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి 136 ఇన్నింగ్స్‌ల్లో 6,609 పరుగులు చేశారు. వన్డే, టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, శతక శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా దాదా రికార్డుల్లో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌పై ఇప్పటికే పలువురు దిగ్గజాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో గంగూలీ ఏ నిర్ణయం తీసుకుంటాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ బీసీసీఐ బోర్డు నుంచి సానుకూల స్పందన వస్తే అందుకు ఐసీసీ కూడా మరో అడుగు ముందుకేసే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షునిగా గంగూలీ నియమించబడ్డ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నేపథ్యంలో ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సదురు బాడీ సభ్యులు గంగూలీకి ముందుగానే తమ విన్నపాన్ని తెలియజేశారు. ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని గంగూలీని కోరారు.

Story first published: Friday, January 10, 2020, 12:33 [IST]
Other articles published on Jan 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+