Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి తండ్రైన కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి సారా రహీమ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గారాలపట్టితో ఉన్న ఫొటోను విలియమ్సన్ పోస్ట్ చేశాడు. 'వరల్డ్ బ్యూటిఫుల్ గర్ల్‌కి స్వాగతం.. మీ సురక్షిత రాకకు, ముందుకు సాగుతున్న ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో విలియమ్సన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 'కంగ్రాట్స్ లెజెండ్' అని కేన్ పోస్ట్‌కు కామెంట్ చేశాడు. కేన్ విలియమ్సన్ దంపతులకు ఇది మూడో సంతానం. వాళ్లకు మూడేళ్ల పాప, ఒక సంవత్సరం వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. ఇటీవల స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. అతని భార్య అనుష్కశర్మ ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి అకాయ్ అని పేరు పెట్టారు.

Welcome to the world beautiful Girl - Kane Williamson to his third child

కాగా, కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు దూరమయ్యాడు. తండ్రి కాబోతున్న సందర్భరంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే స్వదేశంలో జరిగిన ఆ మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ 0-3తో ఓటమిపాలైంది. ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌కు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉన్నాడు.

ప్రస్తుతం విలియమ్సన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శతకాల మోత మోగించాడు. తొలి టెస్టులో 118, 109 పరుగులు సాధించాడు. రెండో టెస్టులో 43, 133* పరుగులతో సత్తాచాటాడు. ఈ క్రమంలో టెస్టు సెంచరీల రికార్డులో విరాట్ కోహ్లిని విలియమ్సన్ అధిగమించాడు. ఈ న్యూజిలాండ్ సూపర్‌స్టార్ 98 టెస్టుల్లో 32 సెంచరీలు, 165 వన్డేల్లో 13 శతకాలు బాదాడు. కోహ్లి టెస్టుల్లో 29, వన్డేల్లో 50, టీ20ల్లో ఒక్క సెంచరీ సాధించాడు.

Story first published: Wednesday, February 28, 2024, 8:58 [IST]
Other articles published on Feb 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+