క్రేజీ ఫ్యామిలీలోకి స్వాగతం: హార్దిక్-నటాషాలకు శుభాకాంక్షలు చెప్పిన కృనాల్

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నూతన సంవత్సంర రోజు బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌ని నిశ్చితార్ధం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం స్పీడ్ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ ముందు మోకాళ్లపై రింగ్ తొడిగాడు.
ఆ తర్వాత కేక్ కట్ చేసి కిస్ ఇచ్చాడు. ఆపై తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని హార్దిక్ పాండ్యా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
దీంతో పాండ్యా-నటాషాలకు ఎంగేజ్‌మెంట్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్‌లో "బిగ్ బిగ్ కంగ్రాట్స్ హార్దిక్ పాండ్య, నటాషా. మా క్రేజీ ఫ్యామిలీతో నువ్వు(నటాషా) కలవడం చాలా సంతోషంగా ఉంది. వెల్‌కమ్ టు ద మ్యాడ్‌నెస్. లవ్ బోత్ ఆఫ్ యూ" అని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా కృనాల్ దంపతులతోపాటు హార్దిక్, నటాషాతో కలిసున్న ఫోటోను పోస్టు చేశాడు. గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానుంది. ఎటువంటి సమాచారం లేకుండానే పాండ్యా నిశ్చితార్థం చేసుకోవడంతో క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
హార్దిక్‌కు పలువురు క్రికెటర్లు విషెస్ తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'వాటే సర్‌ప్రైజ్ హార్దిక్' అంటూ ఓ ట్వీట్ చేసాడు. 'కంగ్రాట్స్ హార్దిక్. వాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్. మీ భవిష్యత్తు బాగుండాలి. దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎప్పటికి ఉంటాయి' అని కోహ్లీ రాసుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications