Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: రెండో వన్డేలో టాస్ గెలవడం కీలకం.. వాతావరణం ఎవరికి అనుకూలం..?

Weather to play a bigger role in second INDvsBAN ODI

బంగ్లాదేశ్‌తో జరిగే రెండో వన్డేలో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి వన్డే జరిగిన స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా జరుగుతుంది. దీంతో పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదని, బ్యాటింగ్ కష్టంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. బౌలర్లకు కొంత ఎక్స్‌ట్రా బౌన్స్ లభిస్తుందని, దీని వల్ల బ్యాటర్లు ఇబ్బంది పడతారని తెలిపారు. దీని వల్లనే భారత బ్యాటింగ్ కొంత తడబడి, భారీ స్కోరు చెయ్యలేకపోయిన సంగతి తెలిసిందే. బంగ్లా బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. రెండో వన్డేలో మాత్రం వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

తొలి వన్డేపై వాతావరణం ప్రభావం పెద్దగా లేదు. అయితే రెండో వన్డేపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఈ వన్డే జరిగే సమయంలో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. దీని వల్ల మ్యాచ్ ఆరంభంలో పేస్ బౌలర్లకు మంచి స్వింగ్ లభించే అవకాశం ఉందట. అలాగే మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగే సమయానికి 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది. అంతేకాదు, తొలి వన్డేలో మంచు ప్రభావం పెద్దగా కనిపించలేదు.

అయితే రెండో వన్డే జరిగే సమయంలో, ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి గాలిలో తేమ 55 శాతం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల సాయంత్రం మంచు ప్రభావం కూడా మ్యాచ్‌పై ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ తేమ వల్ల బంతి తడిగా మారి స్పిన్నర్లకు బంతిపై గ్రిప్ దొరకడం కష్టం అవుతుంది. పేసర్లు కూడా స్వింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఇవన్నీ ఛేజింగ్ చేసే జట్టుకు కలిసొచ్చే అంశాలు. కాబట్టి మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Story first published: Wednesday, December 7, 2022, 10:20 [IST]
Other articles published on Dec 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+