For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: పాకిస్థాన్ ఆశలు ఆవిరి.. టోర్నీ నుంచి ఔట్! (Video)

టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్ కథ లీగ్ స్టేజ్‌‌లోనే ముగిసేలా ఉంది. ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచి, అంతేగాక అదృష్టంతో సూపర్-8కు చేరాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. గ్రూప్-ఏలో ఉన్న పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన విషయం తెలిసిందే. రెండు పాయింట్లు, +0.191 నెట్‌రన్‌రేటుతో టేబుల్‌లో మూడు స్థానంలో ఉంది.

తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో పాకిస్థాన్ సూపర్ ఓవర్‌లో ఓడింది. ఆ తర్వాత ఉత్కంఠ భరితంగగా సాగిన మ్యాచ్‌లో భారత్‌తో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక మొదటి రెండింట్లో ఓటమిపాలైనప్పటికీ కెనడా‌పై ఏడు వికెట్ల తేడాతో నెగ్గి పాకిస్థాన్ మెరుగైన రన్‌రేటుతో సూపర్-8 రేసులో ఉంది. అయితే తదుపరి దశకు చేరుకోవాలంటే ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ స్టేడియంలో ఆదివారం ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తప్పక గెలవాలి.

Weather in Florida Might Determine Pakistan s T20 World Cup Fate

అంతేగాక లాడర్‌హిల్ స్టేడియంలో శుక్రవారం ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫలితాలు ఇలా వస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా పాకిస్థాన్ సూపర్-8కు చేరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే యూఎస్‌ఏ కంటే పాక్ మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగి ఉంది. అయితే ఫ్లోరిడాలో మ్యాచ్‌లు సజావుగా సాగే పరిస్థితులు లేవు. గత కొన్ని రోజులుగా వరుణుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాల ధాటికి వరదలు పోటెత్తుతున్నాయి.

అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ జరిగే శుక్రవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే కాదు. లాడర్‌హిల్‌లో శనివారం జరిగే ఇండియా వర్సెస్ కెనడా, ఆదివారం జరిగే పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. అయితే అమెరికా-ఐర్లాండ్ లేదా పాకిస్థాన్-ఐర్లాండ్ మ్యాచ్‌లలో ‌వర్షం కారణంగా ఏ పోరు రద్దయినా పాకిస్థాన్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఎందుకంటే మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు.

అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఖాతాలో అయిదు పాయింట్లు నిలుస్తాయి. ఆ తర్వాత ఐర్లాండ్‌పై పాక్ నెగ్గినా నాలుగు పాయింట్లతోనే లీగ్ ముగిస్తుంది. దీంతో అమెరికాను పాయింట్ల పరంగా పాక్ దాటలేదు. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓటమిపాలై, తమ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా పాకిస్థాన్‌కు నష్టమే. ఆ సందర్భంలో అమెరికా నాలుగు పాయింట్లు, పాకిస్థాన్ మూడు పాయింట్లతోనూ లీగ్ స్టేజ్‌ను ముగిస్తుంది.

Story first published: Thursday, June 13, 2024, 16:49 [IST]
Other articles published on Jun 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+