Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia 2nd T20 : వర్షం ఎసరు పెట్టేలా ఉందిగా..! పిచ్, వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుందంటే?

 Weather and Pitch Reports For Second T20I Between India vs Australia, Rain May Threat to Match

నాగ్‌పూర్ : టీ20ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా శుక్రవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో 209పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కాపాడుకోలేకపోయి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. సిరీస్ నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిందే. లేకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతగడ్డపై సిరీస్ కోల్పోయి దారుణ పరాభవాన్ని టీమిండియా మూటగట్టుకుంటుంది.

ఇక జట్టులో నెలకొన్న ప్రధాన సమస్య 'డెత్‌' ఓవర్లలో కట్టడి చేసే బౌలింగ్ లేకపోవడం. అయితే స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి రానుండడంతో ఈ సమస్యకు కొంత మేర చెక్ పడొచ్చు. ఇకపోతే ఈ మ్యాచ్ టైంకు వాతావరణం సరిగ్గా ఉంటుందా.. మ్యాచ్ సజావుగా సాగుతుందా అంటే కొంత అనుమానాలైతే ఉన్నాయి.

అంతరాయానికి ఛాన్స్

అంతరాయానికి ఛాన్స్

భారత్ చివరిసారిగా 2019లో నాగ్‌పూర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 30పరుగుల తేడాతో ఓడించింది. ఇక్కడ ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ ఇప్పటివరకు రెండింట్లో గెలిచింది. రెండింట్లో ఓడిపోయింది. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం లేదు. అయితే శుక్రవారం నాగ్‌పూర్‌ మ్యాచ్‌లో మాత్రం వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. తేలికపాటి చినుకులు పడే వీలుంది. ఇక వాన కారణంగా గురువారం జరగాల్సిన శిక్షణ సెషన్ కూడా రద్దయింది. తేమ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 25-27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉరుములు మెరుపులు కూడా రావొచ్చు. సాయంత్రం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం సద్దుమణుగుతుందో లేదో కాస్త డౌటే. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

పేసర్లకు సహకరించే వీలు

పేసర్లకు సహకరించే వీలు

ఇకపోతే విదర్భ స్టేడియంలో ఇప్పటివరకు వరకు 11 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 8మ్యాచ్‌ల్లో గెలిచింది. ఛేదనలో బ్యాటింగ్ చేసిన జట్టు 3సార్లు మాత్రమే గెలిచింది. మొహాలీ పిచ్‌లాగే పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉండొచ్చు. పేసర్లకు మాత్రం పిచ్ చాలా సహకరిస్తుందని పిచ్ ఔట్ ఫిట్ బట్టి క్యూరెటర్స్ చెబుతున్నారు. ఇక చివరి సారి బంగ్లాదేశ్‌తో ఇక్కడ టీ20 మ్యాచ్ జరిగినప్పుడు భారత పేసర్ దీపక్ చాహర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక నేటి మ్యాచ్‌లో మరీ దీపక్ చాహర్ ఆడతాడా లేదో తెలియాల్సి ఉంది.

రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా) :

రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా) :

ఓపెనర్లు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్,

మిడిలార్డర్ : విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,

ఫినిషర్లు : హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్,

స్పిన్నర్లు : అక్షర్ పటేల్, అశ్విన్

బౌలర్లు : దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Friday, September 23, 2022, 12:18 [IST]
Other articles published on Sep 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+