For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్‌లో టీమిండియా రికార్డు!

Weather and Pitch report of Lucknow for second INDvsNZ T20I

మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఈ క్రమంలో లక్నో వేదికగా జరిగే రెండో టీ20 కీలకంగా మారింది. దీనిలో ఓడితే భారత్ ఈ స్కోరు కోల్పోతుంది. అప్పుడెప్పుడో 2019లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. ఆ తర్వాత మళ్లీ మరో ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమి చవిచూడలేదు. ఇప్పుడు స్వదేశంలో ఈ రికార్డు ప్రమాదంలో పడింది. అదే సమయంలో రాంచీలో అద్భుతమైన ఆటతో విజయం సాధించిన కివీస్.. అదే జోరుతో ఈ మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది.

ఇక వాతావరణం విషయానికొస్తే.. ఈ మ్యాచ్ జరిగేది లక్నోలో. ఇక్కడి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకానా స్టేడియంలో రెండు జట్లు తలపడతాయి. ఇక్కడ వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌కు అటూ ఇటుగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

Weather and Pitch report of Lucknow for second INDvsNZ T20I

ఈ స్టేడియంలో పిచ్ బ్యాటర్లకు బాగా సహకరిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మ్యాచులోనే కివీస్ జట్టు మంచి స్కోరు చేసింది. డారియల్ మిచెల్, డెవాన్ కాన్వే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా వాళ్లు అలాగే మంచి టచ్‌లో ఉంటే కివీస్ మరోసారి భారీ స్కోరు చేసే ఛాన్స్ ఉంది. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం ఉండదు. దీంతో బౌలర్లు వికెట్లు కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.

భారత తుది జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Sunday, January 29, 2023, 8:08 [IST]
Other articles published on Jan 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+