
పిచ్ ఎవరికి అనుకూలం?
ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వేదికలో మొత్తం 32 వన్డే మ్యాచులు జరిగాయి. వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 19 మ్యాచుల్లో గెలవగా.. ఛేజింగ్ చేసిన జట్టు 12 మ్యాచుల్లో నెగ్గింది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 245 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 206 పరుగులు. బ్యాటర్లకు బాగా అనుకూలంగా ఉండే ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు కూడా కొంత సహకారం అందుతుంది. దీంతో తొలి మ్యాచులో ఆకట్టుకోని లంక స్పిన్నర్లు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

వాతావరణం?
కోల్‌కతాలో వాతావరణం చాలా క్లియర్‌గా ఉండనుంది. మ్యాచ్ ఆరంభమైన తర్వాత అత్యధికంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని, అలాగే రాత్రికి ఇది 15 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతేకాదు, ఇక్కడ వర్షం పడే అవకాశం కూడా ఎక్కువగా లేదు. ఉదయం పూట వర్షం పడే అవకాశం 5 శాతం ఉండగా.. రాత్రికి అది 7 శాతానికి చేరుతోంది. దీంతో ఇక్కడ వర్షం పడటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో సాయంత్రం పూట మంచు ప్రభావం 79 శాతం ఉంటుందని తెలుస్తోంది. అభిమానులు ఇక్కడ పూర్తి మ్యాచ్ చూడటం గ్యారంటీ.

టీమిండియా టాప్ స్కోర్
ఈ మైదానంలో అత్యధిక అంతర్జాతీయ స్కోరు చేసిన జట్టు భారత జట్టే. గతంలో అంటే 2014లో శ్రీలంతో ఆడిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఈ మైదానంలో భారత జట్టు చివరగా 2017లో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 92 పరుగులు చేయగా.. అజింక్య రహానే (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ కేవలం 9 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












