Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ సత్తా ఉంది: లక్ష్య ఛేదనలో టీమిండియా తడబాటుపై రోహిత్ శర్మ

We would have chased down any target: Rohit

హైదరాబాద్: ఆదివారం ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా తడబాటుకు గురైందనే విషయంపై తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ జట్టు ఎంతటి టార్గెట్‌నైనా సాధించే సత్తా ఉందని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు.

'ఈ సిరిస్ మొత్తంలో జట్టులో ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్లు ఉన్నారు. దాంతో పాటు ఒక ఆల్‌ రౌండర్‌ మా సొంతం. అంటే ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ జట్టుతో ఉన్నారు. దాంతో ప్రత్యర్థి జట్టు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించినా మా ఆటగాళ్లు ఛేదిస్తారు. ఈ సిరీస్‌లో మా జట్టు సరైన కాంబినేషన్లతో పోరుకు సిద్దమైంది' అని రోహిత్ శర్మ అన్నాడు.

'వరుస సిరీస్‌ విజయాల్లో మా సమష్టి కృష్టి కనబడుతోంది. ప్రతి ఒక్కరూ తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. నిజంగా ఇది సమిష్టి కృషి. లంకతో టీ 20 సిరీస్‌ పలువురు యువ క్రికెటర్లకు తొలి గేమ్‌ కాగా, మరి కొందరికి రెండో గేమ్‌ మాత్రమే. వారంతా ఆత్మవిశ్వాసంతో జట్టు మేనేజ్‌మెంట్‌ అప్పజెప్పిన పనిని సమర్దవంతంగా పూర్తి చేశారు' అని రోహిత్‌ శర్మ అన్నాడు.

ప్రస్తుతం తమ దృష్టంతా త్వరంలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉందని అన్నాడు. 'దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎదురుచూస్తున్నాం. స్వదేశంలో మాదిరే అక్కడ కూడా విజయాలను నమోదు చేస్తాం. అంత సులభం కాదు, అయితే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆడుతున్నామనేది ముఖ్యం కాదు' అని రోహిత్ శర్మ అన్నాడు.

కాగా, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో టీమిండియా చివరి వరకూ పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి రెండు ఓవర్లో భారత్‌ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో క్రీజులో ఉన్న ధోని, కార్తీక్‌లు సింగిల్స్‌ తీశారు.

ఆ తర్వాత కార్తీక్‌ సిక్స్‌ కొట్టడంతో చివరి ఓవర్‌లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్‌లో ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని ఫోర్‌గా మలిచి విన్నింగ్‌ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో భారత్ క్లీవ్ స్వీప్ చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 25, 2017, 17:31 [IST]
Other articles published on Dec 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+