
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక టీ20 లీగ్‌లు
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక టీ20 లీగ్‌లు ప్రారంభమయ్యాయి. మరికొన్ని లీగ్‌లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ టీ20లీగ్‌లను నియంత్రించడమే లక్ష్యంగా ఈ గ్రూపును ఏర్పాటు చేసినట్టు కనిపిస్తున్నా.. పరోక్షంగా ఐసీసీ ప్రయత్నం మాత్రం ఐపీఎల్‌లో తలదూర్చడమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూపుపై బీసీసీఐ కాస్తంత ఘాటుగానే స్పందించింది.

ఐసీసీ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు
"రంజీ ట్రోఫీ మాదిరి ఐపీఎల్.. భారత్ దేశవాళీ టోర్నీ. అందువల్ల ఐపీఎల్‌లో ఐసీసీ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ‘ఈవెంట్స్ అనుమతుల గ్రూపు' ఏర్పాటుకు బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ అంగీకరించలేదు. ఈ ఈవెంట్స్ అనుమతుల గ్రూపు ఏర్పాటు విషయంలో బీసీసీఐ సీఈఓ లేవనెత్తిన అభ్యంతరాలతో ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ కూడా ఏకీభవించారు.

తాము ఎంతమాత్రం జోక్యం చేసుకోం
ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాము ఎంతమాత్రం జోక్యం చేసుకోమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. ఐపీఎల్‌లో జోక్యం చేసుకొనే ఆలోచన ఐసీసీకి లేదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్సష్టం జేశారు. ఐపీఎల్ ప్రమాణాల ఆధారంగా ప్రపంచంలోని ఇతర టీ20 లీగ్‌లకు నియమనిబంధనలు రూపొందించనున్నట్టు తెలిపారు.

మీడియాలో వచ్చిన వార్తలు నిజంకావు
"ఐపీఎల్‌లో మేం జోక్యం చేసుకోనున్నట్లు, లీగ్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజంకావు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ సహా కొన్ని అద్భుతమైన టీ20 లీగ్స్ నడుస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. అయితే ప్రతి లీగ్ నిర్దిష్ట ప్రమాణాలతో నడవాలని మేం కోరుకుంటున్నాం. ఈ విషయమై వర్కింగ్ గ్రూప్ చర్చిస్తోంది" అని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ చెప్పాడు.


Click it and Unblock the Notifications













