కొట్టారు..తీసుకున్నాం: మా టైమ్ వస్తుంది: రవీంద్ర జడేజా కాన్ఫిడెన్స్ లెవెల్స్‌కు ఓ దండం

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ఈ టీమ్.. ఆ స్థాయిలో ఆడట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టనే లేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవం పొందింది. చెన్నై తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది.

లివింగ్‌స్టోన్.. మినీ సునామీ..
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్- చెన్నై ముందు 181 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో లియామ్ లివింగ్‌స్టోన్ ఓ మినీ సునామీని సృష్టించాడు. 32 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్-33, జితేష్ శర్మ-26 బ్యాట్‌ను ఝుళిపించడంతో 180 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి 23 పరుగులే ఇచ్చాడు. ముఖేష్ చౌధరి తన వైఫల్యాన్ని కంటిన్యూ చేశాడు.

టాప్ ఆర్డర్ టపటపా..
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోనూ ప్రతిఘటించలేకపోయింది. 36 పరుగులకే సగం టీమ్ డగౌట్‌లో కూర్చుంది. రాబిన్ ఉతప్ప-13, రుతురాజ్ గైక్వాడ్-1, మొయిన్ అలీ-0, అంబటి రాయుడు-13, రవీంద్ర జడేజా-0..ఇదీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేసిన స్కోర్. మిడిల్ ఆర్డర్‌లో శివం దుబే హాఫ్ సెంచరీ, ఎంఎస్ ధోనీ 23 పరుగుతో ఆదుకొని ఉండకపోతే మరింత దయనీయంగా తయారై ఉండేది చెన్నై స్థితి. 18 ఓవర్లల్లో 126 పరుగులకు చాప చుట్టేసింది.

2020 సీజన్ రిపీట్ అవుతుందా?
చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి సరిగ్గా 2020 సీజన్‌ను గుర్తుకు తెస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఆ సీజన్‌లో చెన్నై- ప్లే ఆఫ్ ముఖం చూడకుండానే వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. వరుస ఓటములను చవి చూసింది అప్పట్లో. బౌలింగ్ బాగుంటే..బ్యాటర్లు విఫలం కావడం.. బ్యాటర్లు రాణించిన మ్యాచ్‌లో బౌలర్లు అధ్వాన్నంగా ఆడటం.. అప్పట్లో ప్రతి మ్యాచ్‌లోనూ కనిపించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆడుతున్నారు చెన్నై ప్లేయర్లు.

గట్టిగా కొడతాం..
మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తాము ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అనుకోని తప్పిదాలు చోటు చేసుకుంటోన్నాయని, సరిదిద్దుకుంటామని పవర్ ప్లేలో వికెట్లను పోగొట్టుకోవడం ఓటమికి కారణమైందని పేర్కొన్నాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ప్లేయరే అనడంలో సందేహాలు అక్కర్లేదని, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల్సి ఉందని చెప్పాడు.

కఠోర సాధన..
మళ్లీ తమ ఆటతీరు గాడిన పడటానికి తీవ్రంగా శ్రమిస్తామని, కఠోర సాధన చేస్తామని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. అత్యుత్తమ ఆటతీరుతో తాము మళ్లీ రేసులోకి వస్తామనీ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. శివం దుబే నిలకడగా రాణిస్తున్నాడని, అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు జరిపేలా వ్యూహాలను రూపొందించుకుంటామని వ్యాఖ్యానించాడు. పవర్ ప్లేలో పరుగులను రాబట్టుకోవడం, భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంపై దృష్టి పెడతామని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications