Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ కు కష్టాలు తప్పవు: పాంటింగ్

Ricky Pointing
హైదరాబాద్: వచ్చే టెస్టు సిరీస్ లో భారత బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కు తిరుగులేని కష్టాలను తెచ్చిపెడతామని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. అత్యధిక పరుగులు చేసి బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్న సచిన్ ను నిలువరిస్తామని, దాన్ని సచిన్ కు ఒక కలగానే మిగిలిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మరో 77 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ బ్రియాన్ లారాను అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ సిరీస్ లో సచిన్ టెండూల్కర్ ఆ రికార్డును సృష్టించలేరని పాంటింగ్ అన్నారు.

సచిన్ టెండూల్కర్ పై తనకు అత్యధిక గౌరవం ఉందని, సచిన్ నిజమైన ఛాంపియన్ అని, ఈ స్థాయికి చేరుకోవడంపై ఎవరికైనా గౌరవప్రదమైందేనని ఆయన అన్నారు. తాము విజయం సాధించడానికి వచ్చామని, సచిన్ ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయడమే తమ లక్ష్యమని, సచిన్ ఎదుర్కోవడానికి తమ వద్ద పథకాలున్నాయని ఆయన అన్నారు. యువరాజ్ నాయకత్వంలోని బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో వామప్ మ్యాచులో ఆడడానికి ఆస్ట్రేలియా జట్టు హైదరాబాదుకు వచ్చింది.

వామపక్షాలు కలిసి ఉండాలని, కాంగ్రెసును ఓడించడానికి రెండు వామపక్షాలు కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని కెసిఆర్ రాఘవులుతో చెప్పారు. తాము కూడా అదే కోరుకుంటున్నామని, కాంగ్రెసును ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని రాఘవులు కెసిఆర్ తో చెప్పినట్లు తెలుస్తోంది.
Story first published: Tuesday, September 30, 2008, 16:57 [IST]
Other articles published on Sep 30, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+