మురిసిపోకండి: కోల్‌కతా వన్డేలో భారత్‌పై గెలుస్తామన్న స్మిత్
హైదరాబాద్: తొలి వన్డేలో ఓటమి పాలైన, మిగిలిన వన్డేల్లో భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్‌కతా వేదికగా గురువారం జరగనుంది. రెండో వన్డే నేపథ్యంలో స్మిత్ మీడియాతో మాట్లాడుతూ తొలి వన్డేలో గెలిచుంటే బాగుండేదని, సిరిస్ చేజారకుండా ఉండాలంటే కనీసం మూడు వన్డేలు గెలిస్తే సరిపోతుందని స్మిత్ వ్యాఖ్యానించాడు.

కఠినమైన సిరీస్
‘కఠినమైన సిరీస్.. ఆరంభ మ్యాచ్‌లోనే విజయం సాధిస్తే బాగుండేది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్. ఇంకా నాలుగు వన్డేలు మిగిలి ఉన్నాయి. కాబట్టి సిరీస్ గెలవాలంటే కనీసం మూడు వన్డేలు గెలిస్తే చాలు' అని స్మిత్ అన్నాడు.

కోల్‌కతా వన్డేలో భారత్‌పై గెలుస్తాం
'గురువారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో దొరికిన ఈ విరామ సమయాన్ని బలహీనతలను సరిదిద్దుకునేందుకు ఉపయోగించుకుంటాం. మా ప్రణాళికల్నిచక్కగా అమలు చేసి కచ్చితంగా కోల్‌కతా వన్డేలో భారత్‌పై గెలుస్తాం' అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.

రెండు కొత్త బంతులతో ఆడటాన్ని ఇబ్బంది పడ్డాం
ఇక తొలి వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్‌ని 21 ఓవర్లకు కుదించి ఆసీస్ లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో రెండు కొత్త బంతులతో ఆడడం తమను నష్టపరిచిందని స్టీవ్ స్మిత్ అన్నాడు.

కొత్త బంతితో త్వరగా మూడు కీలక వికెట్లు తీశాం
'రెండు కొత్త బంతులతో 160 పరుగులు ఛేదించడం కష్టమే. అదే ఒక్క బంతితో అయితే సులువుగా ఉండేది. మొత్తం మ్యాచ్‌ను చూస్తే మేం కొత్త బంతితో త్వరగా మూడు కీలక వికెట్లు తీశాం. తర్వాత చాలాసేపు భారత్ ఇబ్బంది పడింది. బంతి పాతబడిన తర్వాత పాండ్యా, ధోని చెలరేగి ఆడారు' అని స్మిత్ అన్నాడు.

నేను రెండు క్యాచ్‌లు వదిలేయడం మా అవకాశాల్ని దెబ్బతీసింది
'20 ఓవర్లు ఉన్నప్పుడు మేం ఓవర్‌కు ఎనిమిది పరుగులు చొప్పున రాబట్టాలి. ఒక బంతే అయితే మొదట వికెట్లు కాచుకొని ఆ తర్వాత హిట్టింగ్ చేసేవాళ్లం. రెండు కొత్త బంతులవ్వడంతో మేం ఇబ్బంది పడ్డాం. నేను రెండు క్యాచ్‌లు వదిలేయడం మా అవకాశాల్ని దెబ్బతీసింది. దానిని పాండ్యా సద్వినియోగం చేసుకున్నాడు' అని స్మిత్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications