Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రాహుల్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తాం.. అతని సత్తా అలాంటిది: రోహిత్ శర్మ

 We will back Rahul says Rohit Sharma

టీమిండియాలో అతి చెత్త ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో కేఎల్ రాహుల్ ముందున్నాడు. గతేడాది కాలంగా ముఖ్యంగా టెస్టుల్లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడీ కర్ణాటక బ్యాటర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం పెళ్లి అయిన వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టినా అతని ఆట మాత్రం మెరుగవలేదు. ఇప్పటి వరకు ఈ సిరీసులో ఆడిన మూడు ఇన్నింగ్సుల్లో వరుసగా 20, 17, 1 స్కోర్లు నమోదు చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో కూడా అతను రాణించలేదు. ఈ క్రమంలో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదీ రాహుల్ సత్తా..

అదీ రాహుల్ సత్తా..

రెండో టెస్టు విజయం తర్వాత రాహుల్ ఫామ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు. 'ఇటీవలి కాలంలో రాహుల్ బ్యాటింగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ మేం టీం మేనేజ్‌మెంట్‌గా ఒక ఆటగాడి సత్తాను చూస్తాం. ఇది కేవలం కేఎల్ గురించే కాదు. గతంలో కూడా చాలా మంది ఆటగాళ్ల విషయంలో ఇదే ప్రశ్న నాకు ఎదురైంది. ఒక ఆటగాడిలో సత్తా ఉంటే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం సహజం' అని తేల్చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పలుమార్లు రాహుల్ కొన్ని కీలక ఇన్నింగ్సులు ఆడాడని గుర్తుచేశాడు.

రాహుల్‌లో సత్తా ఉంది..

రాహుల్‌లో సత్తా ఉంది..

'ఇది కేవలం కేఎల్ ఒక్కడే కాదు.. ఎవరైనా సరే. అతను విదేశాల్లో చేసిన సెంచరీలు (2021లో ఇంగ్లండ్‌లో, 2022లో సౌతాఫ్రికాలో) చూస్తే.. నేను చూసిన బెస్ట్ రాహుల్ ఇన్నింగ్సుల్లో అవి ఉంటాయి. ముఖ్యంగా లార్డ్స్‌లో అతని ఇన్నింగ్స్ అద్భుతం. ఇంగ్లండ్‌లో అలాంటి పిచ్‌పై ఆడటం, అదీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగడం మాటలు కాదు. కానీ రాహుల్ ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సౌతాఫ్రికాపై సెంచూరియన్‌లో చేసిన శతకం ఇంకో గొప్ప ఇన్నింగ్స్. ఆ రెండు మ్యాచుల్లో భారత్ గెలిచింది. అతనిలో అంత సత్తా ఉంది' అని రోహిత్ వివరించాడు.

మేం ఇచ్చిన సలహా అదే..

మేం ఇచ్చిన సలహా అదే..

ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అతన్ని తన సహజమైన ఆట ఆడాలని టీం మేనేజ్‌మెంట్ చెప్పిందట. ఇదే విషయాన్ని చెప్పిన రోహిత్.. 'అతని గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ మా వైపు నుంచి చాలా క్లారిటీ ఉంది. తను తనకు సహజమైన ఆట ఆడాలనే మేం కోరుకుంటున్నాం.' అని రోహిత్ స్పష్టం చేశాడు. అలాగే ఆస్ట్రేలియాతో ఆడిన రెండు టెస్టుల గురించి కూడా మాట్లాడాడు. ఈ పిచ్‌లపై ఆడటం చాలా కష్టమైన పని అని, ఈ విషయంలో రాహుల్‌ను విమర్శించడ తగదని పేర్కొన్నాడు.

ఒక్కొక్కరు ఒక్కోలా ఆడతారు..

ఒక్కొక్కరు ఒక్కోలా ఆడతారు..

'ఇలాంటి పిచ్‌లపై ఆడేటప్పుడు ఎలా ఆడితే పరుగులు వస్తాయో గుర్తించడం ముఖ్యం. టర్నింగ్ పిచ్‌లపై స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేసే విధానం ఒక్కో బ్యాటర్‌కు ఒక్కోలా ఉంటుంది. ఈ జట్టులో కూడా చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ ఒక్కోలా పరుగులు చేస్తారు. ఒక్క ఆటగాడు ఎలా ఆడుతున్నాడు? అని మేం శల్యపరీక్ష చెయ్యడం జరగదు. అందరూ కలిసి ఎలా ఆడతారనేదే మాకు ముఖ్యం' అని క్లియర్‌గా చెప్పేశాడు రోహిత్.

Story first published: Monday, February 20, 2023, 7:08 [IST]
Other articles published on Feb 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+