ముంబై: భారత క్రికెట్ జట్టు స్టార్ విరాట్ కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు బ్రేకప్ చెప్పాడా? అనే చర్చ సాగుతోంది. అందుకు ఆయన ధరించిన టీ-షర్ట్ ఇందుకు కారణం. అనుష్కతో ప్రేమాయణం, ఆ తర్వాత విడిపోవడం, మళ్లీ ఇటీవల కలిసి కనిపించిన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా విరాట్ కోహ్లీ ఓ టీ-షర్ట్ వేసుకున్నాడు. ఆ టీ-షర్ట్ వేసుకోవడంపై చర్చ సాగుతోంది. 'వి వర్ ఆన్ ఏ బ్రేక్' అనే నినాదం రాసి ఉన్న టీ-షర్టుతో దిగిన ఫోటోను కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అతని ఫోటో వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
ఇంతకీ కోహ్లీ దేనికి బ్రేక్ చెప్పాడు? అని చర్చించుకుంటున్నారు. అనుష్కతో బ్రేకప్ నుంచి బ్రేక్ తీసుకున్నాడా? లేక అనుష్క నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడా? మొత్తానికి కోహ్లీ అభిమానుల మెదడుకి మేత భలే పెట్టాడు. దీనిపై కోహ్లీ వివరణ ఇస్తే గానీ తెలిసేట్టు లేదు.