న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాటింగ్‌లో వైఫల్యం: విశాఖ టీ20లో భారత్ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ

India Vs Australia 2019,T20I : Virat Kohli After 3-Wicket Loss Vs Australia In 1st T20I | Oneindia
 We were not up to scratch: Virat Kohli after 3-wicket loss vs Australia in 1st T20I

హైదరాబాద్: విశాఖ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి బంతికి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

<strong>విశాఖ టీ20 ఆస్ట్రేలియాదే: చివరి బంతి వరకు పోరాడి ఓడిన భారత్</strong>విశాఖ టీ20 ఆస్ట్రేలియాదే: చివరి బంతి వరకు పోరాడి ఓడిన భారత్

మ్యాచ్ ఓటమిపై కోహ్లీ ఇలా

మ్యాచ్ ఓటమిపై కోహ్లీ ఇలా

మ్యాచ్‌ ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "బౌలర్ల పోరాటం చూస్తే చాలా గర్వంగా ఉంది. మేం ఈ మ్యాచ్‌ను ఇంత వరకు లాక్కొస్తామని అస్సలు ఊహించలేదు. బుమ్రా అద్భుతం చేశాడు. మయాంక్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడు. తొలి మ్యాచ్‌ను అందిపుచ్చుకోలేకపోయాం. 15వ ఓవర్‌ వరకు పిచ్‌ బ్యాటింగ్‌కు ఏ మాత్రం సహకరించలేదు. మేం బ్యాటింగ్‌లో వైఫల్యం చెందాం" అని అన్నాడు.

టీ20ల్లో తక్కువ స్కోర్లతో నెగ్గడం చాలా కష్టం

టీ20ల్లో తక్కువ స్కోర్లతో నెగ్గడం చాలా కష్టం

"టీ20ల్లో తక్కువ స్కోర్లతో నెగ్గడం చాలా కష్టం. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా రాహుల్‌, పంత్‌లకు అవకాశం కల్పించాం. రాహుల్‌ అద్భుతంగా ఆడాడు. అతడితో నేను మంచి భాగస్వామ్యం కూడా నెలకొల్పా. ఈ పిచ్‌పై 150 పరుగులు చేసుంటే గెలిచేవాళ్లం. మా కంటే అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆసీస్‌ ఆటగాళ్లు ఈ విజయానికి అర్హులు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

టాస్‌ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా

టాస్‌ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా

టాస్‌ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. భారత్ తరుపున కేఎల్ రాహుల్‌ (50) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (29 నాటౌట్‌), కోహ్లి (24) ఫర్వాలేదనిపించారు. రాహుల్, కోహ్లి కలిసి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసి విజయం సాధించింది.

హాఫ్ సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్

హాఫ్ సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్

ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మ్యాక్స్‌వెల్‌ (56), డార్సీ షార్ట్‌ (37) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 68 బంతుల్లో 84 పరుగులు జత చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 బుధవారం బెంగళూరు వేదికగా జరగనుంది. ఆసీస్ బౌలర్లలో మూడు వికెట్లు తీసిన కౌల్టర్ నైల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Monday, February 25, 2019, 10:17 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X