
హైదరాబాద్: టెస్టుల్లో నెంబర్ వన్‌గా కొనసాగాలంటే ప్రతి సిరీస్‌లోనూ గెలవడం ఎంతో ముఖ్యమని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే అన్నాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రహానే మీడియాతో మాట్లాడుతూ శ్రీలంకను శ్రీలంకలో అన్ని ఫార్మాట్లలోనూ వైట్‌వాష్ చేసిన ప్రభావం ప్రస్తుత సిరీస్‌పై ఉండదని అన్నాడు. 'శ్రీలంకలో ఆడిన సిరిస్‌తో పోలిస్తే ఈ సిరీస్ భిన్నమైంది. అక్కడ మేం బాగా ఆడినా, ఇప్పుడు శ్రీలంకను తేలిగ్గా తీసుకోవట్లేదు' అని రహానే అన్నాడు.
ప్రస్తుతం టెస్టుల్లో మేం నెంబర్‌వన్‌గా కొనసాగాలంటే ప్రతి సిరీస్‌లోనూ గెలవడం ఎంతో ముఖ్యమని, ఇక్కడ పరిస్థితులు మాకు తెలుసని రహానే తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు శ్రీలంకతో జరిగే సిరీస్ సన్నాహకమా? అన్న ప్రశ్నకు కూడా బదులిచ్చాడు.
'దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు మాకు ప్రతి మ్యాచ్, సిరీస్ ముఖ్యమైందే. ప్రసుత్తం మా దృష్టంతా లంకతో సిరీస్‌పైనే. దక్షిణాఫ్రికా పర్యటన భిన్నమైంది. అక్కడికెళ్లాక దాని గురించి ఆలోచిస్తాం' అని రహానే అన్నాడు. కాగా, మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం శ్రీలంక భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
టెస్టు సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16 (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే భారత్‌లో భారత్‌పై ఇప్పటివరకు శ్రీలంక ఒక్క టెస్టు సిరిస్ కూడా గెలవకపోవడం విశేషం. దీంతో ఈ టెస్టు సిరిస్‌ను శ్రీలంక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్‌లో , గూగుల్ ప్లస్ ఫాలో అవ్వండి.