For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా గడ్డపై మా మార్క్‌ను వదలిపెడతాం: రోహిత్ శర్మ

India vs Australia 2018-2019 : Rohith sharma Says : Team India Leaves Its Mark In Australia
We want to make it count this time around: Rohit Sharma

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనకు సమాయత్తమైన టీమిండియా తొలి రోజు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తన మార్కును వదలాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. బ్రిస్బేన్ (గబ్బా) వేదికగా జరుగుతోన్న టీ20తో పర్యటనలోని తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జట్టుగా తమ స్పందన అతని అభిప్రాయాలను ఇలా వెల్లడించాడు.

 జట్టు కోరిక:

జట్టు కోరిక:

జట్టుగా మా ఆటతీరేంటో చూపించడానికి ఇదొక చక్కని వేదిక. క్రితం సారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాం. అందులో ఒకటి డ్రా చేసుకోగా.. రెండింటిలో ఓడిపోయాం. ఈ సిరీస్‌తో పాటు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాం. కానీ, ఈ సారి ఆసీస్ గడ్డపై మా ప్రదర్శన గుర్తుండిపోయేలా ఉండాలని భావిస్తున్నాం.

జట్టు భావన:

జట్టు భావన:

మూడు ఫార్మాట్లలోనూ రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. జట్టుకు ఒకటే నమ్ముకుంది. ప్రతి టోర్నమెంట్‌ను విజయంతో ముగించేందుకే ప్రయత్నం చేస్తుంది. ఆస్ట్రేలియా వంటి మైదానాల్లో చక్కగా రాణిస్తే.. ఆ జట్టు ఉత్తమమైన జట్టుగా పేరు తెచ్చుకుంటుంది.

ఆస్ట్రేలియన్ల ఛాలెంజ్ ఏంటంటే:

ఆస్ట్రేలియన్ల ఛాలెంజ్ ఏంటంటే:

అడిలైడ్ వేదికగా రోహిత్ శర్మ బ్రిస్బేన్ అయినా పెర్త్ అయినా రాణించగలమని చెప్పుకొచ్చాడు. కానీ, ఆస్ట్రేలియా బౌలర్లు పొడవుగా ఉండటంతో పరిస్థితులను అదుపుతెచ్చుకోగలరు. వారు అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను చక్కగా కట్టడి చేస్తారు.

పరిస్థితులకు తగ్గట్టు సన్నద్ధమవుతోన్న టీమిండియా

పరిస్థితులకు తగ్గట్టు సన్నద్ధమవుతోన్న టీమిండియా

భారత బ్యాట్స్‌మెన్ చాలా వరకూ అంతపొడుగైన వారు లేరు. ఆస్ట్రేలియా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కష్టపడాల్సి వచ్చింది. కేవలం ఇద్దరికి మాత్రమే ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవాల్సి ఉంది. అదంత సులువు కాకపోవచ్చు. కానీ జట్టుగా పరిస్థితులను చక్కదిద్దుకోవాలనే ప్రయత్నం చేస్తాం.

రోహిత్ సొంత అనుభవాన్ని బట్టి:

రోహిత్ సొంత అనుభవాన్ని బట్టి:

నాకు 2007లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినట్లు గుర్తుంది. అప్పుడు పరిమిత ఓవర్లలో బాగానే ఆడాను. కానీ, రెడ్ బాల్ క్రికెట్‌కి వచ్చేసరికే అసలు చిక్కు వచ్చిపడింది. ఇప్పుడు కూడా నేను దాని గురించే ఆలోచిస్తున్నా. దాని కోసమే కొద్ది రోజుల ముందే ఈ పిచ్‌లపై బౌన్స్‌ని గమనించేందుకు ఇక్కడికి వచ్చాం. బ్రిస్బేన్‌ ఆస్ట్రేలియాలోని ఫాస్టెస్ట్ పిచ్‌లలో ఒకటి. బ్రిస్బేన్, పెర్త్‌లలో ఆడినప్పుడు మంచి బౌన్స్ లభిస్తుంది. దానిని ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంటి దగ్గర ఎక్కువగా సిమెంట్ పిచ్‌ల మీదే ఎక్కువసేపు ఆడేవాళ్లం. అందుకే నాకు ఇక్కడ ఆడటమంటే చాలా ఇష్టం.

Story first published: Monday, November 19, 2018, 15:32 [IST]
Other articles published on Nov 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+