హైదరాబాద్ : ఐదు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించి, మంచి ఊపు మీదున్న భారత యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వన్డే కన్నేశాడు. మూడో వన్డేలోనూ శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. తాము ఆడే ప్రతి మ్యాచ్ విషయంలో అలాగే ఉంటామని స్పష్టం చేశారు.
మూడో వన్డే కోసం భారత జట్టు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమైనదే అని తెలిపాడు. ప్రతి మ్యాచ్ గెలవాలనే సంకల్పంతో ఆడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేస్తామని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేశాడు.

సిద్ధమవుతున్నాం
వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరగబోయే ప్రపంచ కప్‌కు సన్నద్ధమవుతున్నామని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రపంచ కప్ మందు కుర్రాళ్లందరికీ ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదేనని చెప్పారు. 100 శాతం నమ్మకమైన జట్టుతో ప్రపంచ కప్ ఆడుతామని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశారు.
రాయుడిపై ప్రశంసలు
అంబటి రాయుడు ప్రత్యేకమైన ఆటగాడు అని అందరికీ తెలుసు అని విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ.. రాయుడి ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. తనను తాను నిరూపించుకోవడానికి రాయుడు ఎదురు చూశాడని తెలిపారు. రాయుడు ఆత్మవిశ్వాసంతో ఆడతాడని, ఎలాంటి బౌలర్‌నైనా సమర్థంగా ఎదుర్కోగలడని చెప్పాడు.
రాయుడు మూడో స్థానంలో బాగా ఆడుతున్నాడని తెలిపాడు. అతనిలో విభిన్న రకాల నైపుణ్యం ఉందన్నాడు. మిడిలార్డర్‌లో కూడా రాయుడు బాగా ఆడుతాడని ప్రశంసించాడు. రాయుడుకి ఈ గుర్తింపు పదేళ్ల కిందటే రావాల్సిందన్నాడు.