Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌ ఓటమిపై స్పందించిన 'విలియమ్సన్‌'

We tried in the second half but never got going with partnerships says Williamson

ఆదివారం రాత్రి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజా ఓటమితో సన్‌రైజర్స్‌ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఇక గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ (3) దారుణంగా విఫలమయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్‌ ఓటమికి గల కారణాలను విలియమ్సన్‌ వెల్లడించాడు.

'మొదటి ఇన్నింగ్స్ లో బంతితో అద్భుతంగా రాణించాం. అయితే బ్యాటింగ్‌లో తడబడ్డాం. ఏ దశలో కూడా మంచి భాగస్వామ్యాలు నమోదుకాలేదు. ఢిల్లీ అద్భుత ప్రదర్శన చేసింది. ఢిల్లీ ఆటగాళ్లు పరిస్థితులు అందిపుచ్చుకొని పరుగులు సాధించారు. ఈ విజయానికి వారు అర్హులు' అని విలియమ్సన్‌ పేర్కొన్నారు.

'టీ20 టోర్నీలో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. ఐపీఎల్‌ లాంటి టోర్నీలో ఏ జట్టైనా తనదైన రోజున విజయం సాధిస్తుంది. అయితే ప్రణాళికలను మాత్రం సరైన మార్గంలో అమలు చేయాలి. మా ఓపెనర్లు అద్భుతంగా ఆడినా.. మేం ఉపయోగించుకోలేదు. చివరి ఓవర్లలో ఢీల్లి మాత్రం అద్భుతంగా పుంజుకుంది' అని విలియమ్సన్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, April 15, 2019, 12:23 [IST]
Other articles published on Apr 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+