Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KS భరత్ విషయంలో ఇది చాలా అన్యాయం - హర్షా భోగ్లే

టీమిండియా యువ వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై వస్తున్న విమర్శలను ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఖండించాడు. వికెట్ల వెనుక భరత్ పాత్ర అద్వితీయమని కొనియాడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భరత్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉన్న విషయం తెలిసిందే. భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై వికెట్ కీపింగ్ కఠినంగా ఉంటుందని కేఎల్ రాహుల్‌ను కాదని కీపింగ్ గ్లవ్స్ బాధ్యతలను భరత్‌కు అందించారు.

అయితే వికెట్ కీపింగ్‌లో సత్తాచాటుతున్న భరత్ బ్యాటింగ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. ఉప్పల్, వైజాగ్ టెస్టులో నిరాశపరిచాడు. తొలి టెస్టులో 41, 28 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు అశ్విన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భరత్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియా గెలుపు మీద అభిమానులు ధీమాగానే ఉన్నారు. కానీ అతడు ఔటైన అనంతరం మిగిలిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. తన సొంతగడ్డపై జరిగిన వైజాగ్‌ టెస్టులో 17, 6 పరుగులకే వెనుదిరిగాడు.

we tend to measure KS Bharat performance almost entirely by one metric which is unfair - Harsha Bhogle

''ఇంగ్లండ్ సిరీస్‌లో కేఎస్ భరత్ రాణించట్లేదని నివేదికలను చూసి బాధపడ్డా. అవును, బ్యాటుతో అంచనాలకు తగ్గట్లుగా పరుగులు చేయలేకపోయాడు. కానీ టాప్ క్లాస్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. రెండు నైపుణ్యాలతో వికెట్ కీపర్ సత్తాచాటాలి. కానీ ఒకే కొలమానంతో అతడు ప్రతిభను అంచనా వేయడం అన్యాయం. అతడు అద్భుతమైన క్యాచ్‌తో పాటు 30కు పైగా పరుగులు సాధించాడు'' అని హర్షా భోగ్గే అన్నాడు. వైజాగ్‌కు చెందిన భరత్ ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడాడు. 221 పరుగులు చేశాడు.

కాగా, మూడో టెస్టుకు బుమ్రా దూరమవుతున్నాడని వస్తున్న వార్తలపై భోగ్లే స్పందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే రాజ్‌కోట్ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. ''ఒక వేళ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే.. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆడే మ్యాచ్‌కు పక్కన పెట్టండి. కానీ బ్యాటింగ్ పిచ్‌పై అతడు దూరమైతే, అతడి ప్రదర్శనను ఎవరూ భర్తీచేయలేరు. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మూడో టెస్టుకు మరో వారం సమయం ఉంది. అతడిని రాజ్‌కోట్‌లో ఆడించి రాంచీ టెస్టుకు విశ్రాంతిని ఇవ్వడం మంచి ఆలోచన. ధర్మశాల టెస్టుకు అతడు తిరిగి అందుబాటులోకి వస్తాడు'' అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు.

అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.

Story first published: Thursday, February 8, 2024, 16:55 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+