
లంచ్ బ్రేక్ తరువాత..
అదే సమయంలో- మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. ఫస్ట్ రౌండ్ బిడ్డింగ్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలారు. పలువురు క్రికెటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నారు. మధ్యలో ఆక్షనీర్ కిందపడిపోవడంతో కొంత కలకలం చెలరేగింది. అతను క్షేమంగానే ఉన్నాడని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వేలంపాటు 3:30 గంటలకు పునఃప్రారంభమైంది.

రాజస్థాన్ రాయల్స్‌లో అశ్విన్..
ఫస్ట్ హాఫ్‌లో అమ్ముడుపోయిన క్రికెటర్లలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. అతణ్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయిదు కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌తో జట్టులోకి తీసుకుంది. అశ్విన్ కోసం ప్రత్యర్థి ఫ్రాంఛైజీలకు ధీటుగా పోటీ ఇచ్చింది. అయిదు కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి వెనుకాడలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో రవి అశ్విన్ మెంబర్ కావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

185 పరుగుల లక్ష్యంతో..
ఎందుకంటే- ఇదే జట్టులో కొనసాగుతున్నాడు జోస్ బట్లర్. జోస్ బట్లర్-రవిచంద్రన్ అశ్విన్ ఉప్పు-నిప్పుల్లాంటి వారనే పేరుంది. ఇదివరకు బట్లర్‌ను తన బౌలింగ్‌లో అశ్విన్ మన్కడింగ్ చేసిన విషయం తెలిసిందే. 2019 నాటి సీజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ తెరమీదికి వచ్చింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 185 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది.

మన్కడింగ్‌తో..
దీన్ని ఛేదించే క్రమంలో జోస్ బట్లర్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 69 పరుగుల వద్ద ఉన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు క్రీజ్ నుంచి బయటికి వచ్చిన బట్లర్‌ను అనూహ్యంగా మన్కడింగ్‌తో పెవిలియన్ దారి పట్టించాడు అశ్విన్. ఈ ఘటన అప్పట్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. మన్కడింగ్‌ను బ్యాన్ చేసింది ఐపీఎల్. ఈ మ్యాచ్‌ను 14 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ కోల్పోయింది. బట్లర్ క్రీజ్‌లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదనేది తెలిసిన విషయమే.

ఇద్దరూ ఒకే జట్టులో..
మన్కడింగ్ తరువాత జోస్ బట్లర్-రవిచంద్రన్ అశ్విన్ పెద్దగా సఖ్యతగా కనిపించిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆ ఇద్దరు ప్లేయర్లు కూడా ఒకే జట్టులో ఆడబోతోన్నారు. తాజా వేలంపాటలో రవి అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. బట్లర్‌ను ఆ జట్టు ఇదివరకే రిటైన్ చేసుకుంది. దీనితో వారిద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించనున్నారు. రవి అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవడానికి ముందు ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ జోస్ బట్లర్‌ను సంప్రదించడం కొసమెరుపు.

హ్యాపీ వెల్‌కమ్..
రవి అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలనుకునే విషయాన్ని తాము మొదట జోస్ బట్లర్‌కు ఫోన్ ద్వారా తెలియజేశామని రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేక్ ల్యూష్ మెక్‌క్రమ్ చెప్పారు. దీనికి అతను సంతోషంగా అంగీకరించాడని అన్నారు. రవి అశ్విన్ చేరికతో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలోపేతమౌతుందని బట్లర్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు మెక్‌క్రమ్ వ్యాఖ్యానించారు


Click it and Unblock the Notifications
