ఐపీఎల్ తరహాలో.. ప్రపంచకప్‌లో ప్లే ఆఫ్స్ అమలు చేయాలి

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ ఫైనల్లో బౌండరీలతో విజేతను తేల్చడం సరికాదు. మరో సూపర్ ఓవర్‌ను పెట్టాల్సింది. ఐపీఎల్ తరహాలో ప్రపంచకప్‌లో ప్లే ఆఫ్స్ అమలు చేయాలి అని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ టై అవ్వడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా మంది మాజీ ఆటగాళ్లు మరో సూపర్ ఓవర్ పెడితే ఫలితం వచ్చేది అని అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా భరత్ అరుణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

సూపర్ ఓవర్‌ను పెట్టాల్సింది:
భరత్ అరుణ్ మాట్లాడుతూ... 'క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. సచిన్ చెప్పినట్లు ఫైనల్లో మరో సూపర్ ఓవర్‌ను పెట్టాల్సింది. పరుగులు చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నప్పడు బౌండరీలనే ఎందుకు ప్రామాణికంగా ఎంచుకున్నారు. కోల్పోయిన వికెట్లను చూడటం కూడా ఎంతో ఉత్తమం' అని భరత్ పేర్కొన్నారు.

ప్లే ఆఫ్స్ అమలు చేయాలి:
ఐపీఎల్ తరహాలో ప్లే ఆఫ్స్‌ను ప్రపంచకప్‌లో కూడా అమలు చేయాలని సూచించారు. 'ఐపీఎల్ తరహాలో ప్లే ఆఫ్స్‌ను ప్రపంచకప్‌లో కూడా అమలు చేయాలి. ప్లే ఆఫ్స్ వలన పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాల్లో నిలిచిన తొలి రెండు జట్లకు మేలు కలుగుతుంది' అని భరత్ చెప్పుకొచ్చారు. లీగ్ దశలో పట్టికలో 15 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కానీ.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఓడటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా కూడా సెమీస్‌లో ఓడింది.

మెరుగైన స్థానంలో ఉన్న జట్టే విజేత:
తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. 'ఫైనల్ మ్యాచ్ టై అయినపుడు లీగ్ దశలో ఇరు జట్లు పట్టికలో ఉన్న స్థానాలని పరిగణలోనికి తీసుకోవాలి. లీగ్ విజయాలతో పాయింట్లు లేదా నెట్ రన్‌రేటుతో ఏదో ఒక జట్టు ఉత్తమ స్థానంలో ఉంటుంది. మెరుగైన స్థానంలో ఉన్న జట్టుని విజేతగా ప్రకటించాలి. సూపర్ ఓవర్‌లో ఫలితం తేలకుంటే.. విజేతను నిర్ణయించడానికి ఇదే సరైంది' అని చాపెల్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications