మిస్సవుతున్నాం: సంగక్కరపై ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక క్రికెట్ మాజీ దిగ్గజం కుమార సంగక్కర పైన ప్రశంసలు కురిపించారు. ఇటీవల భారత జట్టుతో జరిగిన రెండో టెస్టు అనంతరం సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
శ్రీలంక ప్రధాని రణీల్ విక్రమ్ సింఘేతో ప్రధాని మోడీ సంయుక్తంగా మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగక్కరను మోడీ గుర్తు చేసుకున్నారు. సంగక్కర గొప్ప క్రికెటర్ అన్నారు. అతని సేవలను శ్రీలంక క్రికెట్ జట్టు కోల్పోవడం తీరని లోటు అన్నారు.

శ్రీలంక క్రికెట్‌ను ఉన్నతస్థాయిలో నిలిపిన సంగక్కర అందరికీ ఆదర్శప్రాయుడు అని కొనియాడారు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో సంగక్కర ఒకడు అన్నారు. అతను శ్రీలంకకు అందించిన సేవలు ఎవరూ మరువలేనివి అని చెప్పారు.
వికెట్ కీపర్‌గా, ఎడమ చేతి వాటం బ్యాట్సుమెన్‌గా అమోఘమైన రికార్డులు సొంతం చేసుకున్నాడని, సంగక్కర క్రికెట్ మైదానంలో చూసే అవకాశాన్ని మనమందరం కోల్పోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications