అందవిహీనమైన క్రికెట్‌ని చూస్తున్నాం: కెప్టెన్ ధోని

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా, రెండు, మూడు మ్యాచ్‌లను ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నాల్గవ మ్యాచ్ చూడబోతే డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్‌ని టైగా ప్రకటించడంతో వన్డే సిరిస్‌ని ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ ఇంగ్లాండ్ టీమ్‌కి 281 పరుగులను టార్గెట్‌గా ఇవ్వడం జరిగింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ టీమ్ 270 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయింది.
ఈ సమయంలో ఏ టీమ్ ఐతే గెలిచేందుకు వీలుగా ఉంటుందో వారు గేమ్‌ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడరు. అదే ఏ టీమ్ ఐతే ఓడిపోవడానికి సిద్దంగా ఉందో ఆ టీమ్ ఆడడానికి మాత్రం సిద్దంగా ఉంటుంది. మొత్తం ఆటలో మూడు సార్లు వర్షం పడి ఆటకు ఇబ్బందిని కలగజేసింది. మొట్టమొదటసారి ఇంగ్లాండ్ డక్ వర్త్ లూయిస్ పద్దతి కోరగా, రెండవసారి ఇండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిని కోరడం జరిగిందన్నారు. పగలు పూట ఆట కావడంతో లైట్స్ వేసి ఆడేందుకు రూల్స్ ఒప్పుకోవని అన్నారు.
ఆటను 'టై'గా ఎంపైర్లు ప్రకటించిండంతో చాలామందికి అర్దం కాలేదన్నారు. డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఫైనల్ షీట్ పేపర్ రిజల్ట్‌ని చూస్తే అసలు ఎవరు కూడా గెలిచినట్లు లేదని ధోని తెలిపారు. ఆ తర్వాత ధోని మాట్లాడుతూ ఇలా జరగడం మొట్టమొదటి సారి మాత్రం కాదన్నారు.మొదటి గేమ్‌లో కూడా మేము గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిని చవి చూడడం జరిగిందన్నారు. కానీ వాతావరణాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఏమిలేదని అన్నారు.
పవర్‌ప్లేలో ధోనీ, రైనాలు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. ఐదు ఓవర్లలో 50 పరుగులు చేసి 150 పరుగుల మార్క్‌కు చేరుకుంది. రైనా 58 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీ చేశాడు. ఐదో వికెట్‌కు రైనా, ధోనీ 109 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ధోనీ 58 బంతుల్లో ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లే-3లో భారత్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. రైనా (75 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో )84 పరుగుల వద్ద వెనుతిరిగాడు. రైనా, ధోనీ ఐదో వికెట్‌కు 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ధోనీ 78 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 280 పరుగులు చేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications