కోల్‌కతా: ఇప్పుడు ఆరో గేర్‌లో ఆడామని, కొత్తగా ఎనిమిదో గేర్ వచ్చినా తమకు భయం లేదని, ఎందుకంటే మేం ఆడుతున్న ఆట ఏ స్థాయికైనా సరిపోతుందని, ఇక మా దృష్టంతా మేం ఎదుర్కొనే తొలి బంతి పైనే అని ధోనీ అన్నాడు. ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది కాబట్టి కప్ మాదేనని అనుకోవడానికీ లేదన్నాడు.
ట్వంటీ 20ల్లో గెలుపోటముల మధ్య గీత చాలా సన్నగా ఉంటుందని, కాబట్టి అన్ని జట్లకూ కప్ గెలిచే అవకాశముంటుందన్నాడు. నా దృష్టిలో ఫినిషర్ అంటే లోయరార్డర్ బ్యాట్స్‌మన్ అన్నాడు. టాప్ గేర్‌లో ఉన్నప్పటికీ అలర్టుగానే ఆడుతామని చెప్పాడు.
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్ నిర్మిస్తాడని, అయితే భారీ లక్ష్యాలు ముందున్నప్పుడు.. లోయరార్డర్ పని పూర్తి చేయాల్సి ఉంటుందన్నాడు.

ఫినిషర్ పాత్ర భిన్నమని చెప్పాడు. ఔటైతే మరో బ్యాట్స్‌మన్ ఉండడు కాబట్టి బంతిని బాదే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని, విరాట్ కోహ్లీలా సామర్థ్యమున్న ముగ్గురు బ్యాట్స్‌మెన్ జట్టులో ఉంటే లోయరార్డర్ అవసరం మరీ ఎక్కువగా రాదన్నాడు.
కాగా, అంతకుముందు రోజు గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... తన దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ ఫినిషర్ అని, మీడియానే మహేంద్ర సింగ్ ధోనీని బెస్ట్ ఫినిషర్‌గా ఆకాశానికెత్తుకుందని వ్యాఖ్యానించారు.