Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్‌ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి

We played 3 years without a BCCI: Ravi Shastri ‘thrilled’ on Sourav Ganguly’s appointment as board chief

ముంబై: బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్‌ ఆడింది. బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపికవ్వడంతో ఆశ్యర్యపోయా అని భారత జట్టు హెడ్ కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నారు. తాజాగా రవిశాస్త్రి ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా టుడే కన్సల్టింగ్ స్పోర్ట్స్ ఎడిటర్ బోరియా మజుందార్‌తో రవిశాస్త్రి పలు విషయాలు పంచుకున్నారు.

గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా:

గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా:

'మొదటగా బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ సౌరవ్ గంగూలీ ఎంపికవ్వడంతో ఆశ్యర్యపోయా. బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్‌ ఆడింది. అయితే ఇప్పుడు గంగూలీ అధ్యక్షతనలో బోర్డు ఏర్పాటు అవడం సంతోషంగా ఉంది. దాదా టీమిండియాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇప్పుడు బోర్డును కూడా సరైన నిర్ణయాలతో నడుపుతాడు. అతనిపై నమ్మకం ఉంది' అని రవిశాస్త్రి అన్నారు.

నేనే మొదట అభినందించా:

నేనే మొదట అభినందించా:

అక్టోబర్‌లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో అభిమానులు రవిశాస్త్రిని ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ.. 'గంగూలీ అధ్యక్షుడు అయిన వెంటనే నేనే మొదట అభినందించా' అని తెలిపారు. అద్భుతమైన ఆటగాడు, కెప్టెన్ అయిన దాదా బీసీసీఐలో ఉండడం భారత క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రి గతంలో అన్నారు.

నాపై వేలెత్తితే మీవైపే మూడు చూపిస్తాయి:

నాపై వేలెత్తితే మీవైపే మూడు చూపిస్తాయి:

'గంగూలీ, నా విషయంలో అభిమానులు ఏమనుకున్నా ఫర్వాలేదు. నేను ఏం చెప్పదలచుకున్నాడో అది చెప్పి తీరుతా. నాపై వేలెత్తి చూపితే.. మీ వైపు మూడు వేళ్లు చూపిస్తుంటాయి. నేనేం చెప్పినా దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. అదే విధంగా నేనేం చెప్పదల్చుకున్నానో అది చెప్పడానికి నాకూ అవకాశం ఉంటుంది' అని శాస్త్రి పేర్కొన్నారు.

జీతం రూ. 10 కోట్లు:

జీతం రూ. 10 కోట్లు:

2017లో మాజీ కెప్టెన్ అనిల్‌ కుంబ్లే టీమిండియా కోచ్‌గా తప్పుకున్నాక రవిశాస్త్రి ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత మరోసారి కోచ్‌ పదవి అందుకున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌ వరకు శాస్త్రి కొనసాగనున్నారు. రెండోసారి టీమిండియా కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి జీతం 20 శాతం మేర పెరిగింది. గతంలో రూ. 8 కోట్లు రాగా.. ఇప్పుడు దాదాపు రూ. 10 కోట్ల వరకు వేతనం రానుంది.

Story first published: Tuesday, December 10, 2019, 21:50 [IST]
Other articles published on Dec 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+