కోహ్లీతో పరిగెత్తడం కష్టమే: జాదవ్ మనసులో మాట
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించి ఇంగ్లాండ్‌పై విజయదుందుభి మోగించింది.
యువ ఆటగాడు కేదార్ జాదవ్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 120 పరుగుల, కెప్టెన్ కోహ్లీ 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులతో రాణించడంతో తొలి వన్డేలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టీమిండియా గెలుపు వెనుక లోకల్ బాయ్ కేదార్ జాదవ్ కీలకపాత్ర పోషించాడు.
63/4 పరుగుల వద్ద బ్యాటింగ్‌కు దిగిన జాదవ్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు 200కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన సొంత మైదానం పూణెలో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం ఓ మాటతో క్రికెట్ ప్రియుల మనసులను సైతం గెలుచుకున్నాడు.

జాదవ్ సిక్సుకు మురిసిన కోహ్లీ
ఆటలో భాగంగా కేదార్ జాదవ్ ఆఫ్ సైడ్ ఓ సిక్సర్ కొట్టినప్పుడు కోహ్లీ ఎంతో మురిసిపోయాడు. జాదవ్ దగ్గరకొచ్చి భుజం తడుతూ అతని తలపై చేయి వేసి ఊపుతూ అభినందించాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన వీరిద్దరూ ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
76 బంతుల్లో 120 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే అవార్డు అందుకున్న సమయంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడారు అన్న ప్రశ్నకు
‘ఇలా దేశం కోసం కోహ్లీ ఎన్నోసార్లు ఆడాడు' అని బదులిచ్చి అందరి అభిమానం సంపాదించుకున్నాడు.

మరచిపోలేని అనుభూతి
భారత విజయాల్లో తన పాత్ర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, అందులోనూ సొంత మైదానంలో సెంచరీ చేసి జట్టుకు చక్కటి విజయాన్ని అందివ్వడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు సమక్షంలో కీలక ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉందన్నాడు.

కోహ్లీతో పరిగెత్తడం కష్టమే
భారీ పరుగులను ఎలా చేధించాలో కెప్టెన్ కోహ్లీ తనతో చెప్పడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఆటను దగ్గరగా చూసే అవకాశం ఈ మ్యాచ్‌లో దక్కిందని, గతంలో కొన్నిసార్లు కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని మిస్సయ్యానని అన్నాడు. కోహ్లీతో పరిగెత్తడం కష్టమేనని మనసులో మాటను చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications