న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాలో ప్రపంచకప్‌ గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ

Rohit Sharma Opens Up About India’s T20 World Cup Preparations ! || Oneindia Telugu
‘We need to fill a lot of spots,’ Rohit Sharma on India’s T20 World Cup squad

హైదరాబాద్: టీ20 వరల్డ్‌కప్‌కు చాలా సమయం ఉందని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ మెగా టోర్నీకి సిద్ధమవుతున్నామని అన్నాడు.

"వరల్డ్‌కప్‌లో రాణించేందుకు చాలామంది కుర్రాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. 15-20 మంది చాలా బాగా ఆడుతున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్‌ గెలవడమే మా లక్ష్యం. త్వరలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నాం" అని పేర్కొన్నాడు.

బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు: ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన షేన్ వార్న్ 'గ్రీన్ బ్యాగీ'బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు: ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన షేన్ వార్న్ 'గ్రీన్ బ్యాగీ'

ధోనీలా కెప్టెన్ కోహ్లీకి సాయం చేసేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని రోహిత్‌ అన్నాడు. "అవును, కోహ్లీకి సాయం చేసేందుకు నేనెప్పుడైనా సిద్ధంగా ఉంటాను. ఆటగాళ్లతో పాటు జట్టు కూర్పుపై నాకేం తోచినా చెప్తాను. జట్టుకు నేను వైస్‌ కెప్టెన్‌. ఆటగాళ్లందరినీ గమనించడం, ఏం చేస్తున్నారో పర్యవేక్షించడం నా బాధ్యత" అని రోహిత్ అన్నాడు.

ఇంగ్లాండ్‌కు షాక్‌.. గాయం కారణంగా స్టార్ బౌలర్ దూరం!!ఇంగ్లాండ్‌కు షాక్‌.. గాయం కారణంగా స్టార్ బౌలర్ దూరం!!

ఇక, టోర్నీలు గెలిచేందుకు జట్టుగా మేం అత్యుత్తమంగా ఏం చేయగలమన్నది కెప్టెన్ కోహ్లీకి చెప్పడం తన బాధ్యతగా రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌కు గాను సెలక్టర్లు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.

Story first published: Thursday, January 9, 2020, 15:57 [IST]
Other articles published on Jan 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X