ఆ ఇద్దరిని 'మిస్' అవడం వల్లే.. కోల్‌కతా చేతిలో గుజరాత్‌కు దెబ్బ: రైనా
రాజ్ కోట్: తాజా ఐపీఎల్ సీజన్ మూడో మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆ జట్టు బౌలింగ్ విషయంలో మాత్రం ప్రేక్షక పాత్రనే పోషించింది. కోల్‌కతా ఓపెనర్ల దూకుడు ముందు గుజరాత్ లయన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో కోల్‌కతా ఖాతాలో ఈ సీజన్ తొలి విజయం నమోదైంది.
అంతేకాదు, గుజరాత్ విధించిన 184పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా కేవలం 14ఓవర్లలోనే చేధించి కోల్ కతా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఇంత భారీ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేధించడం ఇదే తొలిసారి. స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యాన్నే నిర్దేశించినా.. పేలవ బౌలింగ్‌తో టీమ్ ఓడిపోవడాన్ని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా జీర్ణించుకోలేకపోతున్నాడు.

అనుభజ్ఞులు లేకపోవడం వల్లే:
మ్యాచ్ అనంతరం తమ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ పేలవ బౌలింగే తమ కొంపముంచిందని రైనా అన్నాడు. అనుభజ్ఞులైన జడేజా బ్రావో అందుబాటులో లేకపోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని చెప్పుకొచ్చాడు. టీ20 ఫార్మాట్ లో జడేజా బౌలింగ్ జట్టుకు లాభిస్తుందని, అలాంటి బౌలర్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం లోటేనని రైనా పేర్కొన్నాడు.

జడేజా ఇప్పుడప్పుడే వస్తాడో.. రాడో!
కాగా, కనీసం రెండు వారాలైన విశ్రాంతి తీసుకోవాలని జడేజాకు బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించిన నేపథ్యంలో మొదటి అంచె మ్యాచులకు జడేజా పూర్తిగా దూరం కానున్నాడు. ఇక మరోవైపు బ్రావో పరిస్థితి కూడా అలాగే ఉంది. తొడ కండాలు పట్టేయడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. వీరిద్దరు జట్టులో చేరితే గానీ గుజరాత్ బౌలింగ్ గాడిన పడేలా లేదు.

అప్పుడే అంచనా సరికాదేమో!
ఆడింది సీజన్ లో తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి మరో రెండు, మూడు మ్యాచులు జరిగితే గానీ గుజరాత్ బౌలింగ్ పై అంచనాకు రాలేము. ఒక్క మ్యాచ్ తోనే ఆ టీమ్ బౌలింగ్ పేలవం అని తేల్చేయలేం. ప్రవీణ్ కుమార్, ధవల్ కులకర్ణి, మన్ ప్రీత్ గోని, గుజరాత్ కు ప్రస్తుతం ప్రధాన బౌలర్లుగా ఉన్నారు. చూడాలి మరి వీరంతా తిరిగి పుంజుకుంటారో! లేక తొలి మ్యాచ్ ఫలితాన్నే రిపీట్ చేస్తారో!

కోల్ కతా ధనాధన్ మంత్రం:
కోల్ కతా ఓపెనర్ల ధనాధన్ ఆటతో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఓవైపు కెప్టెన్ గంభీర్ ఫోర్లతో విరుచుకుపడుతుంటే మరో ఓపెనర్ క్రిస్ లిన్ ఫోర్లు, సిక్సర్లు వీర విహారం చేశాడు. ఈ ఓడిని కట్టడి చేయడంలో గుజరాత్ పూర్తిగా విఫలమైంది. గంభీర్ 12ఫోర్లతో 48బంతుల్లో 76 పరుగులు చేయగా.. క్రిస్ లిన్ 6ఫోర్లు, 8సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో కోల్ కతా వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లోవార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications