న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరిగా ఆడనందువల్లే ఓడిపోయాం: కోహ్లీ

We missed balance in side, says Virat Kohli

హైదరాబాద్: చేధనలో విఫలమవడంతో ఓటమికి గురైన టీమిండియా ప్రదర్శన పట్ల కెప్టెన్ కోహ్లీ అసంతృప్థి వ్యక్తం చేశాడు. అనుకున్న విధంగా వ్యూహాలు అమలు చేయలేకపోవడంతోనే మూడో వన్డేలో ఓటమి పాలైనట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

'విండీస్‌ మా ముందు ఛేదించదగ్గ లక్ష్యాన్నే ఉంచింది. కానీ మేము ఛేదించే క్రమంలో సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాం. మైదానంలో మేం మెరుగ్గానే రాణించాం. కానీ విజయం సాధించడానికి మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

35ఓవర్లు వరకూ కట్టడి చేసినా:

35ఓవర్లు వరకూ కట్టడి చేసినా:

పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 43పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. అంతకుముందు మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. మొదటి 35ఓవర్లు వరకూ విండీస్‌ను కట్టడి చేస్తూనే వచ్చాం. ఆ తర్వాత కూడా అలాగే కొనసాగించి ఉంటే మా ముందు లక్ష్యం 260లోపే ఉండేది. కానీ చివరి పది ఓవర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపించిందన్నారు.

 అద్భుతమైన ప్రదర్శన చేసిన వాళ్లు పూర్తిగా అర్హులు

అద్భుతమైన ప్రదర్శన చేసిన వాళ్లు పూర్తిగా అర్హులు

మరోవైపు విండీస్‌ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. తమకంటూ అవకాశం వస్తే విండీస్‌ ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఈ మ్యాచ్‌లో వాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు అని కోహ్లీ అన్నాడు. జట్టులో సరైన ఆల్‌రౌండర్‌ లేకపోవడం కూడా లోటేనని ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ పేర్కొన్నాడు.

 మూడో వన్డేలో భారత్‌కు ఓటమి

మూడో వన్డేలో భారత్‌కు ఓటమి

వెస్టిండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ మూడో వన్డేలో భారత్‌కు ఓటమి ఎదురైంది. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమైన వేళ వన్డే సిరీస్‌లో భారత్‌ తొలి ఓటమి మూటగట్టుకుంది. తొలి వన్డేలో గెలిచి.. రెండో మ్యాచ్‌ టై చేసుకున్న భారత్‌.. మూడో వన్డేలో ఓడడంతో ఐదు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది.

హైలెట్‌గా నిలిచిన ధోనీ క్యాచ్:

37 ఏళ్లు వచ్చినా ఫిట్‌నెస్‌లో తాను టాప్‌ అని మరోసారి నిరూపించాడు మహేంద్రసింగ్‌ ధోని. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మహి అభిమానులను మురిపించాడు. ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్లో బుమ్రా వేసిన షార్ట్‌పిచ్‌ బంతిని చందర్‌పాల్‌ హేమ్‌రాజ్‌ పుల్‌ చేయబోగా బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో 20 గజాల దూరం పరుగెత్తిన ధోని.. డైవ్‌ చేసి మరీ ఈ క్యాచ్‌ అందుకున్నాడు.

Story first published: Sunday, October 28, 2018, 12:11 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X