Sanju Samson: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ జట్టు విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ నుంచి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. ఢిల్లీ తరపున అభిషేక్ పోరెల్ అత్యధిక పరుగులు చేశాడు. పోరెల్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో రాజస్థాన్ కూడా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం నిర్ణయించబడింది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఓటమి అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కీలక ప్రకటన చేశాడు.
సంజు శాంసన్ ఏం చెప్పాడు?
సూపర్ ఓవర్లో ఓటమి తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ.. రాజస్థాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు. ఢిల్లీ జట్టు రాజస్థాన్ బౌలర్ల ధాటికి కష్టాలు పడిందని.. దీనికి బౌలర్లు, ఫీల్డర్లకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఈ స్కోరు సాధించవచ్చని తాను భావించినట్లు సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. కానీ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో అదరదగొట్టాడని ప్రశంసించాడు. స్టార్క్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. దీనికి క్రెడిట్ అంతా స్టార్క్ కే ఇవ్వాలనుకుంటున్నానని సంజు శాంసన్ స్పష్టం చేశాడు. చివరి ఓవర్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో స్టార్క్ ఢిల్లీని గెలిపించాడని అన్నాడు.

ఇది మ్యాచ్ పరిస్థితి
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టుకు జాక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ ఓపెనర్లు బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే, జాక్ ఫ్రేజర్ 2.3 ఓవర్లలోనే జట్టును వీడాడు. అతను 6 బంతుల్లో 9 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పోరెల్ అద్భుతమైన బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అతనితో పాటు కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఢిల్లీ తరఫున ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అక్షర్ 14 బంతుల్లో 34 పరుగులు, స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు సాధించారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం లభించింది. యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులు చేయగా, రియాన్ పరాగ్ 11 బంతుల్లో 8 పరుగులు చేశాడు. రాజస్థాన్ కూడా 20 ఓవర్లలో 188 పరుగులు చేసి మ్యాచ్‌ను టైగా ముగించింది. సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాజస్థాన్ 11 పరుగులు చేసింది, దీనికి ప్రతిస్పందనగా ఢిల్లీ కేవలం 4 బంతుల్లోనే మ్యాచ్ గెలిచింది.