Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ముందుగా నా భార్యతో మాట్లాడాలి.. ఆమె ఒప్పుకుంటే ప్రపంచకప్‌ ఆడుతా'

Well speak to our wives first: David Warner on opening with Aaron Finch during 2023 World Cup

ముంబై: మూడేళ్ల తర్వాత జరగబోయే 2023 వన్డే ప్రపంచకప్‌పై ఆసీస్‌ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ స్పదించాడు. మెగా టోర్నీలో ఆరోన్‌ ఫించ్‌తో కలిసి ఆసీస్‌కు ఓపెనింగ్‌ చేయాలంటే తమ జీవిత భాగస్వామితో ముందుగా చర్చించాలని వార్నర్‌ అన్నాఅంటున్నాడు. ఒకవేళ నా భార్య ఒప్పుకుంటే నేను అదృష్టవంతుడిని అని చెప్పుకొచ్చాడు. వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వార్నర్‌ (128; 112 బంతుల్లో 17x4, 3x6), ఫించ్‌ (110; 114 బంతుల్లో 13x4, 2x6) చెలరేగడంతో వికెట్‌ నష్టపోకుండా సునాయాస విజయం సాధించింది.

నా భార్యతో మాట్లాడాలి:

నా భార్యతో మాట్లాడాలి:

మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో వార్నర్ పాల్గొనగా.. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫించ్‌తో ఓపెనింగ్ చేస్తారా అని ఓ విలేకరి అడిగాడు. దీనిపై వార్నర్ మాట్లాడుతూ... 'ఈ విషయంపై మేమిద్దరం మా జీవిత భాగస్వాములతో చర్చించాలి. అప్పటికి మాకు 36, 37 ఏళ్లు ఉంటాయి. ఇప్పటికే నాకు ముగ్గురు పిల్లలున్నారు. బహుశా అదే నా చివరి ప్రపంచకప్‌. ఈ మూడేళ్లు ఫామ్‌ను కొనసాగిస్తూ, కుటుంబాన్ని చూసుకోవాలి' అని అన్నాడు.

 నా భార్య ఒప్పుకుంటే అదృష్టవంతుడిని:

నా భార్య ఒప్పుకుంటే అదృష్టవంతుడిని:

'జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లున్నారు. మేం 2023 ప్రపంచకప్‌ ఆడగలుగుతాం. నేనైతే 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నా. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఒకవేళ నా భార్య ఒప్పుకుంటే నేను అదృష్టవంతుడిని. ఫించ్‌, నాకు ఒకరి ఆటపై మరొకరికి అవగాహన ఉంది. ఎలా ఆడాలనేదానిపై మేం ఎప్పటికీ చర్చించుకుంటాం. ఇలా ఆధిపత్యం చెలాయించడం చాలా బాగుంది. ఇదే ప్రదర్శనని వచ్చే ప్రపంచకప్‌ వరకూ కొనసాగిస్తామనే నమ్మకం ఉంది' అని వార్నర్‌ ధీమా వ్యక్తం చేసాడు.

బుమ్రాది గొప్ప బౌలింగ్:

బుమ్రాది గొప్ప బౌలింగ్:

'బ్రెట్‌లీ లాంటి బౌలర్‌ కొంత తడబడుతూ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. జస్ప్రీత్ బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బుమ్రా బౌలింగ్‌లో మార్పు చేస్తే కష్టంగా అనిపిస్తుంది. లసిత్‌ మలింగ 140 కి.మీ వేగంతో స్వింగ్‌ చేసినప్పుడు ఎదుర్కొనేందుకు ఉండేంత సంక్లిష్టంగా అనిపిస్తుంది. అయితే క్రీజులో నిలదొక్కుకోవడంతోనే పరుగులు చేశా. స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లోనూ మార్పు కనిపించింది' అని చెప్పుకొచ్చాడు.

కలవరపాటుకు గురైన వార్నర్:

కలవరపాటుకు గురైన వార్నర్:

తొలి వన్డేలో ఓ గాలిపటం ఆటకు అంతరాయం కలిగించింది. 50వ ఓవర్లో బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చే ముందు గాలిపటం స్పైడర్‌ కెమెరాకు చిక్కుకొని వేలాడింది. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న వార్నర్‌ దానిని చూసి కాస్త కలవరపాటుకు గురయ్యాడు. గాలిపటాన్ని తొలగించేందుకు వెనుకంజ వేసాడు. ఇదే సమయంలో క్రీజులో ఉన్న బుమ్రా గాలిపటం​ దారాన్ని తెంచి కెమెరా నుంచి తీసేశాడు. గాలిపటం కారణంగా కాసేపు ఆట నిలిచింది.

Story first published: Thursday, January 16, 2020, 12:26 [IST]
Other articles published on Jan 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+