ఫోటోలు: 'సొంతగడ్డపై భారత్‌ను ఎదుర్కొవడం కష్టం'
హైదరాబాద్: టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న టీమిండియాను సొంతగడ్డలో ఎదుర్కొవడం చాలా కష్టమని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ అన్నాడు. టీమిండియాతో ఏకైక టెస్టు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా-ఎతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఆదివారం మీడియాతో మాట్లాడాడు.
ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నా, తొలిసారిగా భారత్‌తో టెస్టు ఆడుతుండటం చాలా ఎగ్జైజ్‌మెంట్‌గా ఉందన్నాడు. ర్యాంకులు, ఆటపరంగా ఏ విధంగా చూసిన భారత్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో టీమింండియా అద్భుతంగా ఆడుతోందని తెలిపాడు.

భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్నాం
ఇలాంటి సమయంలో భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్నామని చెప్పాడు. టీమిండియాతో ఆడటం బంగ్లాదేశ్‌కు పెద్ద సవాల్ అని, గొప్ప జట్టుతో ఆడే అవకాశం వచ్చినప్పుడు మా జట్టు సత్తా బయటపడుతుందని షకీబ్ చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లతో బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చిందని తెలిపాడు.

స్పిన్ మా బలం
స్పిన్ తమ బలమని, జట్టులో యువ ఫాస్ట్‌బౌలర్లు ఉన్నారని అన్నాడు. సమష్టి కృషితో భారత్‌కు పోటీ ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పాడు. ఉపఖండంలో ఇప్పటివరకు మా బౌలర్లు బాగా రాణించారని చెప్పిన షకీబ్. బ్యాటింగ్ పరంగా కొంచెం మెరుగవ్వాలని పేర్కొన్నాడు. ఇక ఇక్కడి వికెట్ తన బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుందన్నాడు.

టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది
కానీ, టీమిండియా బ్యాటింగ్, స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందని షకీబ్ అన్నాడు. ఇక అశ్విన్ గొప్ప బౌలర్. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం అతడిని మించిన స్పిన్నర్ లేడు. రెండు మూడేళ్లుగా అశ్విన్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు.

కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్‌మన్
ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే 'కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్‌మన్. బ్యాటింగ్‌లో అతనికి తిరుగులేదు. అతను బ్యాటింగ్ చేసే విధానం గొప్ప ఉంటుంది. కోహ్లిని ఔట్ చేయడం అసాధ్యమన్న స్థాయిలో అతని బ్యాటింగ్ సాగుతోంది' అని షకీబ్ పేర్కొన్నాడు. బంగ్లా, భారత్ జట్ల మధ్య జరిగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు హైదరాబాద్‌లో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications